చిత్ర పరిశ్రమలో వర్మది విభిన్నమైన వ్యక్తిత్వం. ఈయన వివాదం సృష్టించడానికే అన్నట్టు ఎవ్వరూ టచ్ చేయని కాన్సెప్ట్‌లను ఎంచుకుంటూ.. అందర్నీ నోళ్లలో నానుతాడు. సినిమాను ప్రమోట్ చేయడం ఎలాగూ, టైటిల్‌తోనే గొడవలు ఎలా పెట్టగలడో అనే వాటిపై రీసెర్చ్ చేసినట్టుకనిపిస్తోంది.. ఈ ధోరణి.

 

 

ఇకపోతే ఆర్జీవీ తాజా చిత్రం అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు అనే చిత్రం ఆయన్ను ఇప్పటికే మూడు చెరువుల నీళ్లు తాగించి ఎట్టకేలకు ఈ రోజు రిలీజ్ అయ్యింది. ఇకపోతే పీపీ చాల్ ఎంట్రీ ఈ సినిమాలో చాలా విచిత్రంగా ఉంటుంది. ఈ క్యారెక్టర్ ను తీర్చిదిద్దిన విధానం చాలా చక్కగా సాగుతుందని పిస్తుంది. ఇక ర‌మ హ‌త్య‌కు బాబే కార‌ణం అని చెపుతాడు బాబు  నా కాళ్ల మీద ప‌డి క్ష‌మించ‌మ‌ని ఏడుస్తాడు..

 

 

జీస‌న్‌ను న‌న్ను రిక్వెస్ట్ చేశారు. అంటే అవున‌ని అంటాడు. మ‌ధ్య‌లో అమ్మా జ్యోతి నిజ‌మేనా అంటే ఆమె అవున‌ని చెపుతూ ఉంటుంది. మ‌ధ్య‌లో పాల్‌ను ఇంట‌ర్వ్యూ చేయ‌డం ఇష్టం లేక జాఫ‌ర్‌ పారిపోతాడు అయితే  ర‌మ హ‌త్య వెన‌క ఉన్న అస‌లు విషయాలు వెల్ల‌డించేందుకు అమెరికా నుంచి పీపీ చాల్ వ‌చ్చాడు. అంటే కేఏ పాల్ దిగాడు ప్ర‌త్యేక విమానంలో వ‌చ్చిన ఈయన వెంట‌నే నా టార్గెట్టే డిల్లీ 2024లో నేనే పీఎం నా ప్ర‌మాణ‌ స్వీకారానికి 150 దేశాల ప్ర‌ధాన‌మంత్రులు విత్ ఫ్యామిలీతో వ‌స్తారు ..

 

 

నేను గెలిస్తే ఆధార్ కార్డులు ఉండ‌వు ఒక‌టే కార్డు పీపీ చాల్ కార్డు అత‌డి మీద తీసిన స్పెషల్ సాంగ్ అదిరిపోయింది.. ఇకపోతే ఈ సినిమా చూసిన ప్రేక్షకుడు ఒక మంచి అనుభూతిని పొందుతాదనడంలో అనుమానమే లేదు. సినిమా అంత కామెడి కామెడి గా సాగుతుంది. ఇందులో ఎవరిని ఉద్దేశించినట్లుగా  అనిపించదు వాస్తవాలకు దగ్గరగా తీసినట్లుగా ఉందని ప్రేక్షకులు అభిప్రాయ పడుతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: