గద్దముక్కు పంతులా.. ఎవరు అని అనుకుంటున్నారా? ఇంకెవరు మన స్వర్గీయ గొల్లపూడి మారుతీరావు గారండీ..గద్దముక్కు పంతులు అంటే మారుతీరావు అని అందరికి తెలుసు. ఎందుకంటే ఆ పాత్ర ఆయనకి అంతా పేరు తెచ్చినది మరి. దీనితో పాటు 'సింగిల్ పూరి శర్మ 'అనే పేరు కూడా బాగా ఫేమస్..

 

ఈరెండు పాత్రలలో అయన నటన బాగా పేరు తెచ్చింది. సింగల్ పూరి శర్మ అనే పేరు రాఘవేంద్రరావు గారి సుందరకాండ సినిమాలో చేశాను అని, ఎన్ని సినిమాలు చేసిన ఈ రెండు పేర్లే గుర్తుకు వస్తాయని అయన ఒక ఇంటర్వ్యూ లో తెలిపారు. నాకు గద్ద ముక్కు పంతులు అని పేరు పెట్టింది కోడి రామకృష్ణ అని తెలిపారు.నా మొదటి సినిమా" ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య"పెద్ద సక్సెస్ అయింది. ఆ తర్వాత వరసగా నాకు అవకాశాలు వచ్చి పడ్డాయి.

 

గద్దముక్కు పంతులు నా రెండో సినిమాకి వచ్చిన పేరు. కోడి రామకృష్ణ కొన్నాళ్ళు నాదగ్గర శిష్యరికం చేసారు. నేనంటే చాలా గౌరవం, మర్యాద.. అయితే అతను తన సినిమాలో నన్ను గద్దముక్కు పంతులుగా ప్రేక్షకులకు చూపించాలని అనుకున్నారట. కాని ఆ విషయం నాకు చెప్పలేక రాఘవ గారితో చెప్పాడట... గురువుగారు ఆ పేరు తో పిలిస్తే ఎమన్నా అనుకుంటారేమో అని అన్నాడట. అయితే రాఘవ నాకు ఈ విషయం చెప్పాడు.

 

నేను వెంటను సరే పెట్టండి అన్నా.. అలా గద్దముక్కు పంతులుగా కోడి రామకృష్ణ పేరు పెట్టారు.నా 42 ఏళ్ళ వయసులో నటించడం మొదలుపెట్టాను. 35 ఏళ్ల పాటు 280 సినిమాల్లో నటిస్తూనే ఉన్నాను. ఇది నేను అసలు ఊహించలేదు. నటన మాత్రమే కాదు, రచనలు కూడా చేస్తాను.. నా తొలి సినిమా చేసినపుడు 10రూపాయలు రెమ్యూనిరేషన్ తీసుకున్నాను.

 

నాకు డబ్బు మీద ఆశ లేదు. నాకు నచ్చిన పని అవ్వడం వల్ల చేస్తున్నాను. నేను నటుడిగా, రచయితగా, ఉద్యోగిగా చేసిన డబ్బు మీద ఆశ లేదు అని ఒక ఇంటర్వ్యూ లో తెలిపారు. నటుడు, రాచేయుడు, పాత్రికేయుడు, సమాజవేత్త గొల్లపూడి మారుతీరావు ఈరోజు స్వర్గస్థులయినారు. అయన మనతో బౌతికంగా లేకపోయినా అయిన సినిమాలు మన కళ్ళముందే ఉంటాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: