విక్టరీ వెంకటేష్ డిసెంబర్ 13న తన 59వ బర్త్ డే జరుపుకోనున్నారు. ఈ ఇయర్ వెంకీ బర్త్ డే గిఫ్ట్ గా వెంకీమామ సినిమా కూడా రిలీజ్ అవుతుంది. వెంకటేష్ తో పాటుగా ఈ సినిమాలో నాగ చైతన్య కూడా నటించాడని తెలిసిందే. కె.ఎస్ రవింద్ర అలియాస్ బాబి డైరక్షన్ లో వచ్చిన వెంకీమామ సినిమాను సురేష్ బాబు నిర్మించారు. ఈ ఇయర్ 59వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్న వెంకీ వచ్చే ఏడాది షష్టి పూర్తి చేసుకుంటారు.

 

ఇక ఇదిలాఉంటే ఈ పుట్టినరోజు నాడు వెంకీ ఫ్యాన్స్ 653 కేకులతో వెంకీ బర్త్ డే సెలబ్రేట్ చేస్తారని తెలుస్తుంది. అదేంటి అంటే రేపు రిలీజ్ అవుతున్న వెంకీమామ సినిమా 653 థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. అందుకే ఆ సింగిల్ స్క్రీన్ థియేటర్స్ కు వెళ్లి వెంకీ ఫ్యాన్స్ కేక్ కట్ చేస్తారట. వెంకీ ఫ్యాన్స్ బర్త్ డే హంగామా ఓ రేంజ్ లో ఉంటుందని తెలుస్తుంది.

 

ఇక సినిమా విషయానికొస్తే వెంకీమామ సినిమాలో రియల్ లైఫ్ మామా అల్లుళ్లు రీల్ లైఫ్ లో కూడా అలాంటి పాత్రల్లో నటించారు. ఈ ఇయర్ ఆల్ రెడీ ఎఫ్-2తో హిట్ అందుకున్న వెంకటేష్ వెంకీమామతో కూడా మరో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు. ఈ మూవీలో రాశి ఖన్నా, రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ హీరోయిన్స్ గా నటించారు. థమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

 

59 ఏళ్ల వయసు గల వెంకీ దాదాపుగా తెలుగు సిని పరిశ్రమలో 33 ఏళ్ల కెరియర్ సాగించాడని చెప్పొచ్చు. ఎక్కువ హిట్లు కొట్టిన స్టార్ హీరో కాబట్టే ఆయన స్క్రీన్ నేం విక్టరీ వెంకటేష్ అని పెట్టారు. అంతేకాదు ఇండస్ట్రీలో ఉన్న ప్రతి హీరో మెచ్చే కథానాయకుడిగా జీరో పర్సెంట్ ఈగో ఉండే ఏకైక హీరో దగ్గుబాటి వెంకటేష్ అని చెప్పొచ్చు. ఈ ఇయర్ బర్త్ డే సందర్భంగా వెంకీ చేసిన వెంకీమామ రిలీజ్ అవడం దగ్గుబాటి ఫ్యాన్స్ కు నిజంగా సర్ ప్రైజ్ అని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: