మామ విక్టరీ వెంకటేష్... అల్లుడు నాగచైతన్య హీరోలుగా... తెరకెక్కిన సినిమా వెంకీ మామ. విక్టరీ వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా నేడు వెంకీ మామ సినిమా... ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది . రియల్ లైఫ్లోని  మామా అల్లుళ్లు రిల్ లైఫ్లో మామా అల్లుళ్లుగా  వెంకీ మామ సినిమా తెరకెక్కింది. కుటుంబ కథా చిత్రంగా వినోదభరితంగా సాగే ఈ సినిమాకి బాబీ దర్శకత్వం వహించారు. కాగా ఈ సినిమాలో వెంకటేష్ సరసన టాలీవుడ్ హాట్ బ్యూటీ రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ నటించగా... నాగచైతన్య సరసన అందాల ముద్దుగుమ్మ రాశిఖన్నా నటించింది. కాగా ఈ సినిమాలో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా  వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఈ సినిమా పై మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. 

 

 

 ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో... అన్నీ చక్కగా రంగరించి తెరకెక్కించారు దర్శకుడు బాబి. ఏ విషయంలోనూ అరే ఇది ఉండి ఉంటే బాగుండేది అన్న భావన సినిమా చూస్తున్న ప్రేక్షకులకు కలగకుండా సినిమాలో  కామెడీ సెంటిమెంట్ యాక్షన్ అన్ని సమపాళ్లలో ఉండేలా చూసుకున్నాడు దర్శకుడు . ఓ వైపు రియల్ లైఫ్ మామ అల్లుళ్ళ తో రీల్ లైఫ్ లో సందడి చేయిస్తూనే... మరోవైపు కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాడు దర్శకుడు బాబి. ఇక మామ అల్లుళ్ళ సెంటిమెంటుతో సినిమా చూస్తున్న ప్రేక్షకులందరి మనసులు కొల్లగొట్టాడు.  వెంకీ మామ సినిమా చూసిన ప్రేక్షకులు అందరూ మొత్తంగా ఈ సినిమా కొత్త  ఆవకాయ పచ్చడి రుచిలా  అదిరిపోయింది అంటున్నారు. పల్లెటూరు నేపథ్యంలో సాగే ఈ సినిమా... ప్రేక్షకులను బాగానే అలరిస్తోంది. ఇక ఈ సినిమా కథ నేపథ్యం కూడా బాగుండడంతో... ఈ సినిమాను తెగ ఎంజాయ్ చేస్తున్నారు ప్రేక్షకులు .

 

 

 ఇక ఈ సినిమాలో వెంకీ మామ మరోసారి తనదైన స్టైల్ కామెడీ టైమింగ్ తో అదరగొట్టేశాడు. ఏకంగా యువ హీరో అయిన నాగచైతన్యని డామినేట్  చేసేసాడు వెంకటేష్. తనదైన స్టైల్ కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ... మామ అల్లుళ్ళ మధ్య సెంటిమెంట్ సీన్ లను అద్భుతంగా పండించి ఆద్యంతం ప్రేక్షకులందరినీ ఔరా అనిపించాడు. అయితే సెకండాఫ్ లో  ఫ్లాష్ బ్యాక్  సీన్లతో కథలో కాస్త గందరగోళం నెలకొన్నప్పటికీ... ఓవరాల్ గా సినిమా కథ నేపథ్యం... వెంకటేష్ కామెడీ టైమింగ్... అంతా అదిరిపోయింది అని అంటున్నారు ప్రేక్షకులు. మరోసారి ఎఫ్2 రేంజ్ లో వెంకటేష్ ఖాతాలో భారీ హిట్ ఖాయమని చెబుతున్నారు. అయితే సంక్రాంతి బరిలో కాకుండా కొన్ని రోజుల ముందే వెంకీ మామ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడంతో ఈ సినిమా కాసుల వర్షం కురిపించడం ఖాయం అని తెలుస్తోంది. చూడాలి మరి వెంకీ మామ సినిమా  ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: