తెలుగు లో వారసత్వపు హీరోలుగా వచ్చిన విక్టరీ వెంకటేష్, నాగ చైతన్యలు కలిసి నటిస్తున్న మూవీ ‘వెంకిమామ’.   ఈ మూవీలో ఇద్దరు మామా అళ్లుల్లుగా నటిస్తున్నారు. నిజ జీవితంలో కూడా వీరిద్దరూ మామా అళ్లుల్లు కావడం విశేషం.  వెంకటేశ్ - నాగచైతన్య కథానాయకులుగా బాబీ దర్శకత్వంలో 'వెంకీమామ' అనే చిత్రం తెరకెక్కింది.వినోదాత్మక కుటుంబకథా చిత్రంగా ఆద్యంతం అలరించే కథా కథనాలతో  రూపొందిన ఈ చిత్రంలో నాగ చైతన్యకు జోడీగా రాశీ ఖన్నా.. వెంకటేశ్ సరసన పాయల్ రాజ్ ఫుత్ నటించారు.  ఇటీవల ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో  తనకు ఇది మరో ‘మనం’ అంటూ నాగచైతన్య చెబుతున్నారు.

 

మొత్తానికి భారీ అంచనాల నడుమ, వెంకటేష్ పుట్టినరోజు కానుకగా ‘వెంకీమామ’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యూఎస్‌లో ఇప్పటికే ‘వెంకీమామ’ ప్రివ్యూ షోలు ప్రారంభమైపోయాయి. చాలా మంది అక్కడ సినిమాను చూసేశారు. వాళ్లంతా ట్విట్టర్ ద్వారా సినిమాపై తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. అయితే ఈ మూవీ మీద అక్కడైతే పాజిటీవ్ టాక్ వస్తుంది.  అక్కడ నుంచి రివ్యూలు అందించే సినీ విమర్శకులు మాత్రం సినిమాపై పెదవి విరుస్తున్నారు. సాధారణ ప్రేక్షకులు మాత్రం సినిమా బాగుందని అంటున్నారు. కామెడీ, సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయ్యాయని, వెంకటేష్ మరోసారి తన పెర్ఫార్మెన్స్ మెస్మరైజ్ చేశారని చెబుతున్నారు.

 

మూవీ క్లయిమాక్స్ చూస్తే ఎవరికైనా కన్నీరు రావడం ఖాయం అంటున్నారు. కామెడీ, ఎమోషనల్ సీన్స్ చాలా బాగున్నాయని ట్వీట్లు చేస్తున్నారు.  ఇక ఇంటర్ వెల్ బ్యాన్ అదిరిపోయిందట. కాకపోతే ఎమోషన్స్‌లో కొత్త వేరియేషన్స్ చూపించారట.హీరోయిన్లు రాశీ ఖన్నా, పాయల్ రాజ్‌పుత్ పాత్రలకు పెద్దగా ప్రాధాన్యం లేదని ఎక్కువ మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.  తమన్ అందించిన పాటలతో పాటు నేపథ్య సంగీతం అద్భుతంగా ఉందని కొనియాడుతున్నారు. మొత్తంగా చూసుకుంటే సినిమాను అబౌవ్ యావరేజ్ మూవీగా ఈ ట్విట్టర్ సినీ విశ్లేషకులు పరిగణిస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: