సంక్రాంతికి వస్తాడు అనుకున్న వెంకీ మామ ముందుగానే వచ్చేశాడు. కామెడీ, ఎమోషన్స్, సెంటిమెంట్, ఫైట్స్ అబ్బా అబ్బా అన్ని రుచులు కలిసిన సినిమా ఇది. ఎంతో అద్భుతంగా తీశారు సినిమాను. మామగా విక్టరీ వెంకటేష్ అదరగొట్టగా అల్లుడిగా నాగ చైతన్య ఈ సినిమాలో అదరగొడుతున్నాడు. ఇంకా వెంకీ మామ పక్కన పాయల్ రాజపుత్, అల్లుడు నాగచైతన్య పక్కన రాశి ఖన్నా కథానాయకలాగా నటించారు. 

                            

వెంకీ మామ సినిమాలో ఫస్ట్ హాఫ్ ఎంతో ఎంటర్టైన్మెంట్ గా ఉందని, అయితే దర్శకుడు బాబీ ఫస్ట్ హాఫ్ ఎంతో అద్భుతంగా తీసినప్పటికీ, సెకండ్ హాఫ్ పై మాత్రం కేర్ తీసుకోలేదని అంటున్నారు. అయితే ఓవర్ ఆల్ గా సినిమా అంత చూస్తే బాగానే ఉందని, చాలా ఏళ్ళ తరువాత వెంకటేష్ ని మంచి రోల్ లో చూశామని కొందరు ప్రేక్షకులు పబ్లిక్ టాక్ లో చెప్తున్నారు. 

                       

అయితే సినిమా అంత అద్భుతంగా ఉన్న ఎక్కడ గొప్పగా లేదు అని చెప్తున్నారు ప్రేక్షకులు. సినిమాలు అన్ని రకాల రుచులు కలిసి ఉన్నాయి.. కానీ ఏదో ఒక రుచి అయితే చివరి వరుకు ఉండాలి కదా ? లేకుంటే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. ఒక యాక్షన్ ఓ.. లేదా కామెడీ.. లేదా ఫ్యామిలి ఇలా ఏదో ఒకటి అయినా ఎక్కువ ఉంది ఉంటే సినిమా అదిరిపోయేది అని అంటున్నారు నెటిజన్లు. ఏది ఏమైనా ఏ సినిమాలు లేని రోజు ఓ మంచి మల్టి స్టార్ సినిమా రిలీజ్ అయ్యింది కాబట్టి సినిమా వసూళ్ల పరంగా దూసుకుపోతుంది అనే చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: