సాధారణంగా సినిమాలు ఫ్లాప్ అయితే ప్రస్తుత రోజుల్లో సినిమా హాల్లో సినిమా ఉన్న సమయంలోనే సదరు సినిమా చూడటానికి ఆడియన్స్ ఎక్కువగా ఇష్టపడటం లేదు. అంతే కాకుండా ఈ సినిమా హిట్ అయినా గాని కేవలం రెండు వారాలు మినహా తర్వాత కనబడటం లేదు. అలాంటిది చిరంజీవి సినిమా పైగా ఫ్లాప్ అయిన సినిమా తమిళ టీవీ రంగంలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసినట్లు కోలీవుడ్ మరియు టాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినబడుతున్నాయి. విషయంలోకి వెళితే మెగాస్టార్ చిరంజీవి సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నటించిన 'సైరా' సినిమా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2వ తారీఖున తమిళం, మలయాళం, కన్నడం, హిందీ మరియు తెలుగు భాషల్లో రిలీజ్ అయింది.

 

అయితే ఒక్క తెలుగు భాషలో మాత్రమే బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసుకుంది. తమిళంలో భారీ అంచనాల మధ్య విడుదలైన 'సైరా' పెద్దగా తమిళ ప్రజలను ఆకట్టుకోలేకపోయింది. అటువంటి చిరంజీవి సినిమా 'సైరా' తమిళ బుల్లితెరపై సరికొత్త రికార్డు క్రియేట్ చేసినట్లు తమిళ టిఆర్పి రేటింగ్స్ లెక్కలు చెబుతున్నాయి. విషయంలోకి వెళితే రీసెంట్ గా ఈ చిత్రాన్ని తమిళ బుల్లితెరపై టెలికాస్ట్ చేశారు. థియేటర్స్ లో సినిమా నిరాశపరచడంతో టిఆర్పి రేటింగులపై కూడా పెద్దగా అంచనాలు లేవు.

 

కానీ ఆశ్చర్యకరంగా సైరా తమిళ వర్షన్ టీఆర్పీ రేటింగ్స్ లో రికార్డ్ సృష్టించింది. ఏకంగా సైరా బుల్లితెర ప్రీమియర్ కు 15.4 టీఆర్పీ నమోదు చేసుకున్నట్లు వార్తలు వినబడుతున్నాయి. ఈ స్థాయిలో తమిళ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోల సినిమాలు కూడా ఇలాంటి టిఆర్పి రేటింగ్ ఇప్పటివరకు సాధించలేదని ఇది మామూలు విషయం కాదని తమిళ మీడియా వర్గాలు తాజాగా ఈ వార్త పై కథనాలు ప్రసారం చేస్తున్నాయి. ఒక డబ్బింగ్ చిత్రం తమిళ టెలివిజన్ రంగంలో ఈ స్థాయి టిఆర్పి రేటింగ్ సాధించడం అంటే అది మెగాస్టార్ క్రేజ్ కి నిదర్శనం అని చాలామంది ఇండస్ట్రీ వర్గాలకు చెందిన వాళ్లు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: