సంక్రాంతికి సరిగ్గా నెలముందు విడుదలైన సినిమా వెంకీ మామ.. విక్టరీ వెంకటేష్‌, యువ సామ్రాట్‌ నాగచైతన్య హీరోలుగా తెరకెక్కిన ఎమోషనల్‌ ఫ్యామిలీ డ్రామా ఇది. ఈ సినిమా రిలీజ్‌ కు ముందే విడుదల చేసిన టీజర్‌, ట్రైలర్‌లు ఆ అంచనాలను మరింతగా పెంచేశాయి. ప్రమోషన్స్ విషయంలో చిత్రయూనిట్ సక్సెస్ సాదించినట్లే. ఇకపోతే  ఈ చిత్రంలో హీరోయిన్లు గా నటించిన రాశీ ఖన్నా, పాయల్ రాజ్‌పుత్ పాత్రలకు పెద్దగా ప్రాధాన్యం లేదని ఎక్కువ మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు..

 

 

అలాగే, సెకండాఫ్ ఇంకాస్త బెటర్‌గా ఉంటే బాగుండని అంటున్నారు. సెకండాఫ్‌లో చాలా సన్నివేశాలు రొటీన్‌గా ఉన్నాయట. కథలో కొత్తదనం ఏమీ లేదని, స్క్రీన్‌ప్లే కూడా అంత గొప్పగా లేదని చెబుతున్నారు. తమన్ అందించిన పాటలతో పాటు నేపథ్య సంగీతం అద్భుతంగా ఉందని కొనియాడుతున్నారు. మొత్తంగా చూసుకుంటే సినిమాను అబౌవ్ యావరేజ్ మూవీగా సినీ విశ్లేషకులు పరిగణిస్తున్నారు. అయితే, వెంకటేష్‌కి ఉన్న ఇమేజ్‌ను బట్టి ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో కుమ్మేయడం ఖాయమంటున్నారు.. ఇకపోతే రియల్‌ లైఫ్‌ మామా అల్లుళ్లు వెంకీ, చైతూలు రీల్‌ లైఫ్‌లోనూ అంతే ఈజ్‌తో నటించారు. ఇద్దరు తమ పాత్రల్లో జీవించారనే చెప్పాలి.

 

 

ముఖ్యంగా తెర మీద వీరిద్దరి కాంబినేషన్‌ సూపర్బ్ అనిపించేలా ఉంది. వెంకటేష్‌ తన కామెడీ టైమింగ్‌తో పాటు ఎమోషనల్‌ యాక్టింగ్‌తో ఆడియన్స్‌ను కట్టిపడేశాడు. వెంకీ స్థాయి యాక్టింగ్‌ను మ్యాచ్‌ చేయటంలో చైతూ కాస్త తడబడినా తన పాత్రలో ఒదిగిపోయాడట..ఇక సినిమా రిలీజ్‌కు ముందే పాటలతో హిట్ కొట్టిన తమన్‌, నేపథ్య సంగీతంతో మరింత ఆకట్టుకున్నాడు. ఫస్ట్ హాఫ్‌ లవ్‌, కామెడీ సీన్స్‌తో పాటు సెకండ్‌ హాఫ్‌లో వచ్చే యాక్షన్‌, ఎమోషనల్‌ సీన్స్‌లో బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఆకట్టుకుంటుంది.

 

 

సినిమాకు ప్రసాద్‌ మూరెళ్ల సినిమాటోగ్రఫి మరో మేజర్‌ ప్లస్‌ పాయింట్‌.. పల్లెటూరి సన్నివేశాలతో పాటు ఆర్మీ ఎటాక్‌, కాశ్మీర్‌లో చిత్రీకరించిన క్లైమాక్స్‌ సీన్స్‌లో కెమెరామెన్‌ పడిన కష్టం తెరమీద కనిపిస్తుంది. ఎడిటింగ్‌ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. చాలా సన్నివేశాలు సాగదీసిన ఫీలింగ్‌ కలిగిస్తాయి. ఫ్యామిలీ మల్టీ స్టారర్‌ సినిమా కావటంతో సురేష్‌ బాబు ఖర్చుకు ఏ మాత్రం వెనకాడకుండా సినిమాను రిచ్‌గా తెరకెక్కించాడు. ఇకపోతే ఈ సినిమాపై భారీ క్రేజ్‌ ఏర్పడింది. మరి ఆ అంచనాలను వెంకీ మామ అందుకున్నట్లే కనిపిస్తున్నాడు. పండగకు నెలరోజుల ముందు మరో  హిట్ సినిమా తనఖాతాలో వేసుకున్నట్లే అంటున్నాయి సినీ వర్గాలు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: