మొత్తానికి ఎప్పుడెప్పుడా అని అక్కినేని, దగ్గుబాటి ఫ్యాన్స్ చూస్తున్న ఎదురుచూపులకు నేడు తెరపడింది. తొలిసారిగా విక్టరీ వెంకటేష్, ఆయన మేనల్లుడు నాగ చైతన్య కలిసి నటిస్తున్న వెంకీ మామ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఎస్ ఎస్ థమన్ స్వరాలు సమకూర్చిన ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లు నిర్మించగా యువ దర్శకుడు బాబీ ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రపంచవ్యాప్తంగా భారీ రేంజ్ లో రిలీజ్ అయిన ఈ సినిమాపై చాలావరకు మిశ్రమ స్పందన లభిస్తోంది. ఇక విక్టరీ వెంకటేష్ ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచారని, అలానే నాగచైతన్య కూడా బాగానే నటించినట్లు ప్రేక్షకులు చెప్తున్నారు. 

 

మంచి ఎమోషన్ తో, కమర్షియల్, యాక్షన్ అంశాలతో పాటు కామెడీని కూడా కలగలిపి దర్శకుడు బాబీ ఈ సినిమాను ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించడం జరిగింది. జాతకాల ప్రభావం వలన ఇద్దరు మామ, అల్లుళ్ల జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకున్నాయి, ఆ తరువాత వాటిని వారు ఏ విధంగా అధిగమించారు అనే పాయింట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ చాలా బాగుందని, అయితే సెకండ్ హాఫ్ మాత్రం ఊహించిన రేంజ్ లో లేదని ప్రేక్షకులు అంటున్నారు. ముఖ్యంగా సినిమాలో వెంకీ, చైతు మధ్య వచ్చే కామెడీ మరియు ఎమోషన్స్ సీన్స్ బాగున్నాయి. ఇక ఇందులో హీరో వెంకటేష్ కు జోడిగా రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్, అలానే నాగ చైతన్యకు జోడిగా రాశి ఖన్నా హీరోయిన్స్ గా నటించారు. 

 

వాస్తవానికి సెకండ్ హాఫ్ లో కొంత ల్యాగ్ సీన్లు ఉన్నప్పటికీ, ఓవర్ ఆల్ గా ఈ సినిమా కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని, తప్పకుండా రాబోయే రోజుల్లో వారి ఆదరణతో సినిమా మంచి కలెక్షన్స్ సాధించడం ఖాయం అని దగ్గుబాటి మరియు అక్కినేని ఫ్యాన్స్ అంటున్నారు. ఇక సినిమాలో థమన్ అందించిన సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, విజువల్స్, యాక్షన్ సీన్స్, కామెడీ వంటివి బాగా ఎలివేట్ అయ్యాయి అనే చెప్పాలి. అయితే సెకండ్ విషయంలో మాత్రం దర్శకుడు బాబీ తడబడ్డాడు అనే చెప్తున్నారు. మరి కుటుంబ సమేతంగా చూడదగిన సినిమాగా నిలుస్తున్న వెంకీ మామ రాబోయే రోజుల్లో ఎంత మేర కలెక్ట్ చేస్తుందో చూడాలి.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: