మనిషిలో కలిగే ఉద్వేగాలకు సినీ సెలబ్రిటీలు కూడా అతీతు లేమి కాదు. కన్నీరు అందరికి ఉప్పుగానే వస్తుంది. దీనిలో వయో బేధం గాని పేద, ధనిక అనే తారతమ్యం గాని ఉండవు. బావోద్వేగం కలిగితే ఎవరైన ఒకటే. ఇకపోతే డిసెంబర్ 13 వ తారీఖున విడుదలైన ‘వెంకీమామ’ చిత్ర సక్సెస్‌తో వెంకీ భావోద్వేగానికి గురయ్యారు.

 

 

ఇకపోతే  ప్రతి ఒక్కరి జీవితంలోనూ తల్లిదండ్రుల తరువాత ఎక్కువ ఎఫెక్షన్ మేనమామతోనే ఉంటుంది. మామ అనే పిలుపులో తెలియని భరోసా.. అంతకు మంచిన అనుబంధం, ఆప్యాయతలు కనిపిస్తుంటాయి. ఇక మామా అల్లుళ్లు రిలేషన్‌లో ఉన్న మధురానుభూతిని రియల్ లైఫ్‌లోనే కాదు రీల్‌ లైఫ్‌లోనూ రుచి చూసిన వెంకటేష్, నాగచైతన్యలు ఆ జ్ఞాపకాలతో కళ్లు చెమర్చుకున్నారు..

 

 

ఇకపోతే వెంకటేష్, నాగ చైతన్య నటించిన మల్టీస్టారర్ మూవీ ‘వెంకీమామ’.. వెంకీ బర్త్ డే సందర్భంగా నిన్న విడుదలై మంచి పాజిటివ్ టాక్‌‌ను రాబట్టింది. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వెంకటేష్, నాగ చైతన్యలు మామా అల్లుళ్లుగా నటించి ప్రేక్షకుల్ని మెప్పించారు. ఫుల్ ఎంటర్‌టైనర్ ఎమోషనల్ మూవీగా ‘వెంకీ మామ’ చిత్రం తొలిరోజు పాజిటివ్‌ను రాబట్టింది. ఈ సందర్భంగా విక్టరీ వెంకటేష్ భావోద్వేగ పోస్ట్‌లు ఇన్‌స్టా గ్రామ్‌లో షేర్ చేశారు. తన మేనల్లుడు నాగచైతన్యతో కలిసి నటించిన ‘వెంకీ మామ’ చిత్రం సక్సెస్ కావడంతో, ఈ సందర్భంగా ఆనంద సమయంలో వెంకటేష్ తన తండ్రి దగ్గుబాటి రామానాయుడ్ని తలుచుకుని, ‘మిస్ యు నాన్నా’.. అంటూ ఎమోషనల్ అయ్యారు.  

 

 

తను ఉన్న నాగచైతన్య చిన్ననాటి ఫొటోని  ‘ఈ సంతోషంలో నువ్వు వుంటే బావుండేది నాన్నా’ అంటూ  చేశారు షేర్ చేశారు వెంకటేష్. ఇకపోతే ఇండస్ట్రీలో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ తీసి మూవీ మొగల్‌గా పేరు గాంచిన రామానాయుడుకి కొడుకులు, మనవళ్లతో సినిమా తీయాలని కోరిక ఉండేదట. అయితే నేడు ‘వెంకీ మామ’ చిత్రంతో ఆయన కోరిక నెరవేరిందను కుంటున్నారు ఆయన మనసు ఎరిగిన వారు..

మరింత సమాచారం తెలుసుకోండి: