ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ షో తెలుగు ప్రేక్షకులను ఎంతగా అలరిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతివారం సరికొత్త కామెడీ తో ప్రేక్షకులని కడుపుబ్బా నవ్విస్తూ టీవీలకు అతుక్కుపోయేలా చేస్తుంది  జబర్దస్త్. జబర్దస్త్ కమెడియన్ స్కిట్ లో వేసే పంచులతో తెలుగు ప్రేక్షకులందరూ టీవీలు ముందు పగలబడి నవ్వుకుంటూ ఉంటారు. ఇక జబర్దస్త్ లో చాలామంది కొత్త కమెడియన్స్ వస్తూనే ఉన్నారు తమదైన శైలిలో కొత్త కొత్త కామెడీని పండిస్తూ ఉంటారు. జబర్దస్త్ షో మొదలై ఏళ్ళు గడిచిపోతున్న ఇప్పటికీ ప్రతీవారం సరికొత్త స్కిట్ లతో కమెడియన్స్ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారూ . ఎక్కడ రిపీటెడ్ స్కీట్లు చేయకుండా.. కొత్త కొత్త పంచులు పేలుస్తూ కడుపుబ్బ నవ్విస్తున్నారు. 

 

 అయితే జబర్దస్త్ లోకి అప్పుడప్పుడు స్టార్ కమెడియన్ రావడం.. హీరోలు రావడం జరుగుతుంటుంది. కేవలం జబర్దస్త్ ఎంట్రీ ఇచ్చిన గెస్ట్ ల స్కిట్ లో భాగం చేసి   క్రేజ్ ను పెంచుకోవడానికి కమెడియన్స్ కూడా ట్రై చేస్తూ ఉంటారు. ఇప్పటికి ఎంతో మంది కమెడియన్స్ హీరోస్ కూడా గెస్ట్ గా ఎంట్రీ ఇచ్చి అటు స్కిట్ లో కూడా రెండు మూడు పంచులు పేల్చినా  వారు ఎంతో మంది ఉన్నారు ఇప్పుడు తాజాగా మరో స్టార్ కమెడియన్ జబర్దస్త్ కి ఎంట్రీ ఇచ్చాడు . జబర్దస్త్ కి ఎంట్రీ ఇచ్చి తనదైన కామెడీతో సందడి చేశాడు టాలీవుడ్ స్టార్ కమెడియన్ పోసాని కృష్ణ మురళి. 

 


 జబర్దస్త్ గెస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన పోసాని వెంకీ మంకీస్ టీం లో స్కిట్ లో పాల్గొన్నాడు. ఇక పోసాని కామెడీ చేస్తే  టైమింగ్ ఎలా ఉంటుందో తెలుగు ప్రేక్షకులకు తెలియనిది కాదు. పోసాని కామెడీ టైమింగ్  వెంకీ మంకీస్ టీం బాగా యూస్ చేసుకుంది . దీంతో జబర్దస్త్ ప్రేక్షకులు ఈ ఎపిసోడ్  చూడడానికి ఎదురుచూస్తూ ఉన్నారు. ఇదిలా ఉంటే అటు పోసానికి గతంలో కంటే ఇప్పుడు సినిమా అవకాశాలు తగ్గాయని చెప్పాలి ఎందుకంటే గతంలో ప్రతి సినిమాలో పోసాని కనిపించేవాడు కానీ ఇప్పుడు మాత్రం అవకాశాలు తగ్గడంతో పోసాని సినిమాల్లో  తక్కువగా కనిపిస్తున్నాడు. అయితే తనకు అవకాశాలు రాకపోవడానికి టీడీపీనే కారణం అంటూ గతంలో సంచలన వ్యాఖ్యలు కూడా చేశాడు పోసాని . ఇకపోతే తాజాగా జబర్దస్త్ స్కిట్ లో పోసాని  సందడి చేసిన ప్రోమో  నెట్టింట్లో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: