నందమూరి బాలకృష్ణ, కె.ఎస్ రామారావు కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా రూలర్. డిసెంబర్ 20న రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు వైజాగ్ లో జరుగుతుంది. సోనాల్ చౌహాన్, వేదిక, భూమిక వంటి స్టార్స్ నటిస్తున్న ఈ సినిమాకు చిరంతన్ భట్ మ్యూజిక్ అందించారు. 

 

ఇక ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ మోడ్రెన్ లుక్ తో పాటుగా మాస్ లుక్ లో కూడా కనిపిస్తున్నాడు. రెండు డిఫరెంట్ లుక్స్ లో బాలయ్య బాబు అదరగొడుతున్నాడు. ముఖ్యంగా చెప్పాలంటే బాలయ్య బాబు ఈ లుక్ కుర్రాళ్లకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉంది. 60 ఏళ్ల వయసులో కూడా బాలకృష్ణ ఇలా కనిపించడం చూసి కుర్ర హీరోలకు షాక్ ఇస్తున్నాడు.

 

ఈ సినిమాలో బాలకృష్ణ లుక్ కచ్చితంగా నందమూరి ఫ్యాన్స్ ను అలరించేలా ఉంటుందని చెప్పొచ్చు. సినిమాలో సోనాల్ చౌహాల్ గ్లామర్ కూడా సినిమాకు స్పెషల్ క్రేజ్ తెచ్చుకునేలా ఉంది. చాలారోజుల తర్వాత వేదిక, భూమిక కూడా ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. కె.ఎస్ రవికుమార్ ఈ సినిమాతో మరోసారి తన సత్తా చాటుతాడని తెలుస్తుంది.

 

ఇక ఈ సినిమా తర్వాత బాలకృష్ణ 106వ సినిమా బోయపాటి శ్రీను డైరక్షన్ లో తెరకెక్కుతుంది. ఈ సినిమాలో కీర్తి సురేష్, కేథరిన్ త్రెసాలను హీరోయిన్స్ గా తీసుకోవాలని చూస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాలో విలన్ గా శ్రీకాంత్ నటిస్తాడట. ఈ సినిమాతో తప్పకుండా శ్రీకాంత్ కెరియర్ టర్న్ అవుతుందని అంటున్నారు. బోయపాటి శ్రీను తర్వాత బాలయ్య బాబు మరిసారి పూడి జగన్నాథ్ డైరక్షన్ లో సినిమా చేస్తాడని తెలుస్తుంది. పైసా వసూల్ తర్వాత బాలయ్యతో పూరి చేస్తున్న ప్రాజెక్ట్ ఇదే. ఈ మూవీతో కూడా బాలయ్య సెన్సేషన్ సృష్టిస్తాడని చెప్పొచ్చు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: