నందమూరి నట సింహం బాలకృష్ణ కె.ఎస్ రవికుమార్ డైరక్షన్ లో వస్తున్న సినిమా రూలర్. డిసెంబర్ 20న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వైజాగ్ లో నందమూరి ఫ్యాన్స్ సమక్షంలో జరుగుతుంది ఈవెంట్ గ్రాండ్ గా జరుగుతుంది. ఎన్.టి.ఆర్ బయోపిక్ తో ఆశించిన స్థాయిని అందుకోలేని బాలయ్య బాబు రూలర్ తో హిట్ ట్రాక్ ఎక్కుతాడని అంటున్నారు. అయితే సినిమా టీజర్ చూస్తే రెగ్యులర్ మాస్ మసాలా మూవీలానే అనిపించింది.

 

అంతేకాదు బాలకృష్ణ లుక్ మీద కొన్ని విమర్శలు వచ్చాయి. సినిమా కథ కూడా రొటీన్ గానే ఉంటుందని ట్రైలర్ చూసి చెప్పేస్తున్నారు. అయితే ఇండస్ట్రీలో మాత్రం 100 సినిమాలకు పైగా చేశాడు బాలయ్యకు ఆమాత్రం తెలియదా కంటెంట్ కొత్తగా లేకుండా అసలు బాలయ్య ఎందుకు చేస్తాడని రివర్స్ లో వేసుకుంటున్నారు.

 

అయితే ఊహించని విధంగా రిలీజ్ ముందు బాలయ్య రూలర్ సినిమాకు పాజిటివ్ బజ్ ఏర్పడింది. సినిమా రొటీన్ కథ అని వస్తున్న వార్తలకు షాక్ ఇస్తూ టీజర్, ట్రైలర్ లో ఫైట్స్ మాత్రమే రివీల్ చేసి అసలు కథ వెండితెర మీద చూపిస్తారని తెలుస్తుంది. రూమర్స్ కు చెక్ పెడుతూ బాలయ్య రూలర్ ఓ రేంజ్ లో బిజినెస్ కూడా చేసింది. అంతేకాదు సినిమాలో హీరోయిన్స్ గ్లామర్ షో కూడా సినిమాకు ప్లస్ అవుతుందని తెలుస్తుంది.

 

సినిమాలో బాలయ్య లుక్ సర్ ప్రైజ్ చేస్తుంది. అంతేకాదు ఊర మాస్ కంటెంట్ నందమూరి ఫ్యాన్స్ కు పండుగ చేసుకునేలా ఉంటుందని తెలుస్తుంది. మరి కె.ఎస్ రవికుమార్ తో బాలకృష్ణ ఎలాంటి సినిమా చేశాడన్నది డిసెంబర్ 20న తెలుస్తుంది. ఈ సినిమాను సి కె ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ లో సి కళ్యాణ్ నిర్మిస్తున్నారు. రూలర్ సినిమాలో బాలకృష్ణ సరసన సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్స్ గా నటించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: