బాలకృష్ణ సీనియర్ నటులలో గొప్ప నటుడు... స్వర్గీయ ఎన్టీఆర్ గారి అబ్బాయి... సినిమాల్లో నే కాదు రాజీకీయాల్లోను దూసుకుపోతున్న రూలర్ బాలకృష్ణ... రాజకీయాల్లో ఉన్నాగాని అభిమానులు కోసం తన దైన శైలిలో సినిమాలు తీసి ప్రేక్షకుల అభిమానం సంపాదించుకున్నారు..

 

నందమూరి బాలకృష్ణ తాజాగా రూపొందిన చిత్రం రూలర్... ఈ సినిమా డిసెంబర్ 20 న విడుదలకి సిద్ధం గా ఉంది. తమిళ దర్శకుడు కెఎస్ రవికుమార్ దర్శకత్వం వహించిన సినిమా రూలర్. మాస్ సినిమాలకి, పంచ్ డైలాగ్స్ కి బాలకృష్ణ పెట్టింది పేరు...

 

రూలర్ మూవీ కూడా పక్కా మాస్ కమర్షియల్ సినిమా అంట. ఈ మూవీలో బాలకృష్ణ రెండు డిఫరెంట్ పాత్రలతో ప్రేక్షకులని అలరించబోతున్నారు.. ప్రతిసారి సంక్రాoతి బరిలో ఉండే బాలకృష్ణ ఈసారి సంక్రాంతి కి ముందే సినిమాని విడుదల చేస్తున్నారు. ఈమధ్య రిలీజ్ అయిన రూలర్ ట్రైలర్ ప్రేక్షకులకు మంచి కిక్ ఇచ్చింది..

 

ఈ వయసులో కూడా యూత్ హీరోస్ కి ఏ మాత్రం తగ్గకుండా స్టైల్ మెయింటైన్ చేస్తున్నారు.. డిఫరెంట్ లుక్ తో ఎనర్జిటిక్ గా ఉన్నారు ట్రైలర్లో.. ఫ్యాన్స్ కి కావాల్సిన అన్ని అంశాలు ఏ మూవీలో ఉన్నాయని భావిస్తున్నారు.

 

బాలకృష్ణ సరసన హాట్ బ్యూటీ సోనాల్ చౌహన్, వేదికలు హీరోయిన్స్ గా నటిస్తున్నారు.. జయసుధ, భూమిక, ప్రకాష్ రాజ్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.ఇంతకముందు తీసిన సినిమాలు బాలకృష్ణ కి అనుకున్నంత విజయం సాధించలేదు. రూలర్ బాలకృష్ణ కి మంచి గుర్తిపు ఇస్తుందని, సినిమా పెద్ద హిట్ అవుతుందని ట్రైలర్ చూస్తే అర్ధం అవుతుంది.

 

గౌతమి పుత్ర శాతకర్ణి, జై సింహ సినిమాలకి సంగీతాన్ని అందించిన చిరంతన్ భట్ ఈ సినిమాకి కూడా బాణీలు అందిస్తున్నారు.. ఈ సినిమా ఎలా  ఉందొ తెలియాలంటే డిసెంబర్ 20 దాక ఆగాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: