సమంత..  టాలీవుడ్ స్టార్ హీరోయిన్. ఓ బేబీ.. మజిలీ అంటూ ఈ సంవత్సరం ప్రేక్షకులను ఓ రేంజ్ లో అలరించిన సంగతి తెలిసిందే. ఈ అందాల అల్లరి భామ ప్రేక్షకులకు ఎంతో దగ్గర అయ్యింది. పెళ్లైన సరే భర్తతో కలిసి సినిమాలు తీస్తుంది. ప్రేక్షకులకు దూరం కాకుండా అప్పుడప్పుడు ట్విట్టర్ లో స్పందిస్తూ ప్రేక్షకుల మనసు దోచుకుంటుంది. 

                   

అయితే పవన్ కళ్యాణ్ సినిమా రిజెక్ట్ చేసినట్టు భారీ ఎత్తున వార్తలు వస్తున్నాయి. అసలు నిజంగా సమంత పవన్ కళ్యాణ్ సినిమాకు నో చెప్పిందా అనే సందేహాలు వస్తున్నాయి. ఎందుకంటే వీరు గతంలోనే ఓ సూపర్ హిట్ సినిమా తీశారు. అదే అత్తారింటికి దారేది. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆ సమయంలో ఓ రేంజ్ లో హిట్ అయ్యింది. 

                    

అయితే ఇప్పుడు సమంత గురించి పక్కన పెడితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాలీవుడ్ పింక్ రీమేక్ తో ఇండస్ట్రీలో రీఎంట్రీ ఇస్తున్నారు. అలాంటి పవన్ కళ్యాణ్ సినిమాకు సమంత నో చెప్పడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాగా ఈ సినిమాను తెలుగులో నిర్మాత దిల్ రాజు, బోణి కపూర్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. 

 

ఇందులో ప్రధాన పాత్ర పోషించిన తాప్సీ రోల్‌కి చిత్ర బృందం మొదట సమంతాను సంప్రదించిందట. అయితే సమంత మాత్రం ఈ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించిందని సమాచారం. కాగా, సమంతా ప్రస్తుతం '96' రీమేక్, 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్‌లో నటిస్తూ బిజీగా ఉంది. ఏది ఏమైనా పవర్ స్టార్ చిత్రాన్ని సమంత రిజెక్ట్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: