ప్రస్తుతం జనసేన పార్టీ కార్యకర్తల నుండి మరియు అదే విధంగా మెగా ఫ్యాన్స్ నుండి పవన్ కళ్యాణ్ సినిమా చేయాలని కోరుకుంటున్నారు. సినిమాలు చేస్తూ రాజకీయాలు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారని అదేవిధంగా ప్రస్తుతం జనసేన పార్టీ తో పాటుగా ఉన్న పార్టీల అధ్యక్షులు వ్యాపారాలు చేసుకుంటూనే రాజకీయాలు చేయటం లేదా అటువంటిది మీరు సినిమా చేయడంలో తప్పు లేదని మళ్లీ పవన్ కళ్యాణ్ సినిమాలు చేయాలని అభిమానులు బాగా కోరుకుంటున్నారు.

 

ఇదే క్రమంలో పవన్ కళ్యాణ్ ఇటీవల పాల్గొన్న ఓ ప్రైవేటు మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ...తాను కూడా సినిమాలు చేయటానికి రెడీ అవుతున్నట్లు అయితే హీరోగా మాత్రం కాకుండా నిర్మాతగా సినిమాలు నిర్మించాలని తనకు ఎప్పటి నుండో కోరిక అంటూ మరియు అదే విధంగా ప్రస్తుత రోజుల్లో ఓ పొలిటికల్ పార్టీ ని ముందుకు నడిపించాలంటే ఖచ్చితంగా ఆదాయం గట్టిగా ఉండాలని అయితే తనకు సినిమాల ద్వారా డబ్బు సంపాదించడం తెలుసని తనకు తెలిసిందల్లా సినిమా ప్రపంచం అంటూ పవన్ కళ్యాణ్ పేర్కొనటం జరిగింది.

 

త్వరలోనే సినిమాలు నిర్మిస్తానని ఈ మేరకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో సినిమాను నిర్మించడానికి రెడీ అవుతున్నట్లు పవన్ కళ్యాణ్ వెల్లడించడం జరిగింది. అయితే ఈ సినిమాకి సంబంధించి డైరెక్టర్ విషయంలో ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో రకరకాల వార్తలు గట్టిగా వినబడుతున్నాయి. ముందుగా అయితే పవన్ కళ్యాణ్ క్లోజ్ ఫ్రెండ్ త్రివిక్రమ్ తో పవన్ కళ్యాణ్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు అని వార్తలు వస్తున్న తరుణంలో తాజాగా మాత్రం పవన్ కళ్యాణ్ కెరీర్లో మర్చిపోలేని బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన హరీష్ శంకర్ తో పవన్ కళ్యాణ్..రామ్ చరణ్ హీరోగా పెట్టి సినిమా నిర్మించాలనే ఆలోచనలో ఉన్నట్లు కొత్తగా వార్తలు ఇండస్ట్రీలో వినబడుతున్నాయి. ఇదే కనుక నిజమైతే కచ్చితంగా మెగా అభిమానులకు మతిపోయే కాంబినేషన్ పవన్ కళ్యాణ్ సెలెక్ట్ చేసినట్లే అని అంటున్నారు సినిమా విశ్లేషకులు.  

మరింత సమాచారం తెలుసుకోండి: