మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లో నుండి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత వివి వినాయక్ దర్శకత్వంలో ‘ఖైదీ నెంబర్ 150’ సినిమా చేసి విజయం సాధించడం జరిగింది. ఆ తర్వాత పాన్ ఇండియా తరహాలో డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి 'సైరా' స్టోరీ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం జరిగింది. దీంతో ఈ సినిమా భారీ బడ్జెట్ తో కొణిదెల వారి ప్రొడక్షన్లో తెరకెక్కింది. దాదాపు ఈ సినిమా కోసం చిరంజీవి ఏకంగా రెండు సంవత్సరాలు సమయం కేటాయించడం జరిగింది. సౌత్ ఇండస్ట్రీ లో అనేక భాషలకు చెందిన ప్రముఖ నటీనటులను మరియు అలాగే బాలీవుడ్ ఇండస్ట్రీ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఇలా పెద్ద స్టార్ కాస్టింగ్ ఉండేటట్లు చూసుకుంటు ఈ సినిమాను తెరకెక్కించాడు డైరెక్టర్ సురేందర్ రెడ్డి. స్వాతంత్ర పోరాట నేపథ్యంలో తెలుగు ప్రాంతానికి చెందిన మొట్టమొదటి పోరాటయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.

 

భారీ అంచనాల మధ్య సైరా సినిమా ఈ సంవత్సరం అక్టోబర్ మాసంలో గాంధీ జయంతి సందర్భంగా రెండవ తారీకున విడుదలయ్యింది. అయితే అన్ని భాషల్లో విడుదలైన ఈ సినిమా కేవలం తెలుగులో తప్ప మిగతా అన్ని చోట్ల ఫ్లాప్ టాక్ సొంతం చేసుకుంది. తెలుగులో మాత్రం దుమ్ము దులిపే కలెక్షన్ తో నాన్ బాహుబలి రికార్డులను పగలగొట్టింది. ముఖ్యంగా ఆ సమయంలో దసరా సెలవులు ఉన్న నేపథ్యంలో అదే సమయంలో మరొక పెద్ద సినిమా ఏది కూడా లేకపోవడంతో సైరా కి బీభత్సమైన కలెక్షన్లు తెలుగులో మాత్రమే వచ్చాయి.

 

తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈ సినిమా అటు బాలీవుడ్ ఇండస్ట్రీలో అలాగే సౌత్ ఇండస్ట్రీలో అనేక భాషల్లో విడుదలైన ఈ సినిమా ఏ మాత్రం ప్రేక్షకులను అలరించలేకపోయింది. ఇదిలా ఉండగా టాలీవుడ్ ఇండస్ట్రీలో మరియు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర 'ఇంద్ర' తరహాలో 'సైరా' సినిమా రికార్డు కలెక్షన్లు సాధించడంతో చిరంజీవి అభిమానులు చాలాకాలానికి మెగాస్టార్ తన స్థాయికి తగ్గ హిట్ కొట్టారని 'సైరా' సినిమా విజయం పట్ల కామెంట్ చేశారు. అంతేకాకుండా మెగా కాంపౌండ్ కి సంబంధించి మెయిన్ హీరోలు పవన్ కళ్యాణ్, బన్నీ మరియు చెర్రీ సినిమాలు ఏవి కూడా 2019 సంవత్సరం మెగా ప్రేక్షకులను అలరించ లేకపోవడంతో మెగా అభిమానులు ఈ సంవత్సరమంతా పీడ కలగానే భావించి కేవలం మెగాస్టార్ 'సైరా' సినిమా విజయంతో సరి పెట్టుకోవడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: