ఒకప్పుడు సినిమాలకు ఇప్పుడు సినిమాలకు ఎంతో మార్పు ఉంటుంది. ప్రేక్షకుల పంథా  మారింది. సినిమాలు తీసే తీరు మారింది. నాటి సినిమాలకు నేటి సినిమా కు అసలు పొంతన లేకుండా అయిపోయింది.. హీరోలు కథలు సెలెక్ట్ చేసే తీరు కూడా మారిపోయింది. డైరెక్టర్లు తమ సినిమాను తెరకెక్కించే తీరు మారిపోయింది. నూతన టెక్నాలజీ పరంగానే కాదు.. అన్ని విధాలుగా ప్రస్తుతం సినిమా తీరు పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు హీరోలు అంటే ప్రేక్షకుల్లో దేవుళ్ళ లెక్క... కానీ ఇప్పుడు ఎంత స్టార్ హీరోల అయినా వారి జీవితంలో ప్రేక్షకులే  హీరోలు. ఈరోజు హీరో స్టార్ డమ్  చూసి సినిమాలను హిట్ చేసే  రోజులు పోయాయి... సినిమా తీస్తున్న  డైరెక్టర్ ను చూసి... సినిమా థియేటర్కు వెళ్లి సినిమాను ఎంజాయ్ చేసే రోజులు ఎప్పుడో పోయాయి. హీరో ఎవరైనా డైరెక్టర్ ఎవరైనా కథ బాగుంటే ప్రేక్షకులు దాన్ని హిట్ సినిమాగా  మార్చేస్తున్నారు.దీనికి  టాలీవుడ్ లో ఎన్నో సినిమాలు  నిదర్శనం. 

 

 

 

 పేరుకు చిన్న సినిమాలు... బడ్జెట్ లో  కూడా పెద్ద సినిమాలతో పోలిస్తే చాలా తక్కువ... కానీ కథ కథాంశం దర్శకుడు తెరకెక్కించిన విధానం బాగుంటే.. ఆ సినిమా భారీ బడ్జెట్ సినిమా కంటే ఒక రేంజిలో విజయం సాధిస్తూ ఉంటుంది.ఇలాంటి సినిమాలకు నిదర్శనం.. పెళ్లి చూపులు, ఆర్ఎక్స్ 100, లాంటి సినిమాలు.  ప్రస్తుతం ఎంత గొప్ప కాంబినేషన్ లో అయినా.. ఎంత  భారీ బడ్జెట్ అయిన ... స్టార్ హీరోలు నటించిన ప్రేక్షకుడు మాత్రం ఆలోచించే తీరు భిన్నంగా ఉంటుంది. ఇలాంటి సినిమాలకు నిదర్శనం  సైరా, సాహో లాంటి సినిమాలు.  ప్రస్తుతం ప్రేక్షకులంతా రెండున్నర గంటలపాటు థియేటర్లో ఒక్కసారి కూడా ఎందుకు వచ్చాము రా బాబు తమ  సినిమాకి  అనుకుకోకుండా  దర్శకుడు కూడా చాలా జాగ్రత్త పడుతున్నారు.ఇక ప్రతి ప్రేక్షకుడు కథలో చాలా కొత్తదనాన్ని వెతుకుతున్నాడు. 

 

 

 సినిమా కథలో ఎలాంటి కొత్తదనం లేకుండా ఒకవేళ స్టార్ హీరోలు సినిమాలు తీశారు అనుకోండి ... స్టార్ హీరో సినిమా కాబట్టి భారీ ఓపెనింగ్స్ వస్తాయి కానీ ఆ తర్వాత సినిమా డిజాస్టర్ గా మారిపోతుంది ఇలాంటిది  ఎన్నో సినిమాల్లో కూడా నిరూపణ అయింది.ఇక ఎంత స్టార్ హీరో అయిన స్టార్  దర్శకుడైన... ప్రేక్షకులకు నచ్చేలా మెచ్చేలా  సినిమాను తీర్చిదిద్దడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే ఇప్పుడు వస్తున్న స్టార్ హీరోల సినిమాలైన కథలో కొత్తదనం ఉంటేనే విజయం సాధిస్తున్నాయి .. ఇక సరికొత్త కథాంశంతో వచ్చిన చిన్న సినిమాలు కూడా భారీ విజయాలు సాధిస్తున్నాయి. దీంతో ఎంత భారీ బడ్జెట్ సినిమాల్లో  అయినా సినిమాల విషయంలో ప్రేక్షకులే  హీరోలుగా మారిపోతున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: