టాలీవుడ్ దర్శకరత్నగా పేరుగాంచిన దాసరి నారాయణ రావు గారి గురించి మన తెలుగు వారికి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. రాజబాబు, ఎస్వీ రంగారావు కాంబినేషన్లో తెరకెక్కిన తాత మనవడు సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన దాసరి నారాయణ రావు గారు, తొలి సినిమాతోనే మంచి సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్నారు. ఆ తరువాత వరుసగా అవకాశాలతో టాలీవుడ్ లో దూసుకెళ్లిన దాసరి, అక్కడినుండి అగ్ర కథానాయకులు అందరితో కలిసి పని చేసి ఎన్నో అద్భుతమైన విజయాలు సొంతం చేసుకున్నారు. 

 

మొత్తం తన కెరీర్ లో 140 సినిమాలు తీసిన దాసరి గారు, 80 సినిమాల్లో నటుడిగా నటించి ప్రేక్షకులను మెప్పించారు. మన టాలీవుడ్ కు పెద్ద దిక్కుగా మారిన దాసరి గారు, చాలా మంది హీరోల సినిమా ఫంక్షన్ లకు హాజరై వారిని ఆశీర్వదించేవారు. అంతేకాక టాలీవుడ్ లో అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్న వారికి, అలానే వయసు మీద పడి సరైన జీవనాధారం లేని వారికి దాసరి తన వంతుగా కొంత సాయం కూడా చేసేవారు. ప్రస్తుతం కొనసాగుతున్న దర్శకుల్లో చాలా మంది కూడా తమకు దాసరి గారు స్ఫూర్తి అని చెప్తుంటారు అంటే, టాలీవుడ్ లో దర్శకుడిగా దాసరి గారి కి ఎంతో గొప్ప పేరు ఉందొ అర్ధం చేసుకోవచ్చు. 

 

కాగా అనారోగ్య కారణాలతో దాసరిగారు 2017, మే లో మన అందరినీ విడిచి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. అన్న ఎన్టీఆర్ గారి దగ్గరి నుండి మొన్నటి మోహన్ బాబు గారి కుమారుడు మంచు విష్ణు వరకు దాదాపుగా అందరూ హీరోలతో పని చేసిన దాసరి గారు లేని లోటు ఆయన మరణం తరువాత టాలీవుడ్ లో స్పష్టంగా కనపడుతోందని, ఆయన ఉండి ఉంటె ఇండస్ట్రీలో ప్రస్తుతం ఎందరో నటులు పడుతున్న అవస్థలకు స్పందించి సినీ పెద్దలతో మాట్లాడి వారికి తప్పకుండా సాయమందించేవారని పలువురు దర్శక, నిర్మాతలు మరియు ఇతర మూవీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు......!!

మరింత సమాచారం తెలుసుకోండి: