సినిమా ఇండస్ట్రీకి రాజకీయాలకు ఎప్పటినుంచో అవినాభావ సంబంధం ఉంది. చాలామంది రాజకీయ నేతలు సినిమా ఇండస్ట్రీలో రాణిస్తున్న వారు ఉన్నారు..  సినిమా ఇండస్ట్రీలో స్టార్ గా ఎదిగిన తర్వాత రాజకీయాల్లోకి వెళ్లి తన సత్తా చాటీనా నటులు  ఉన్నారు. ఇక సినిమా ఇండస్ట్రీలో నుంచి రాజకీయాల్లోకి వెళ్లి చాలా మంది స్టార్లు తమ లక్కును పరీక్షించుకునప్పటికీ... సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్లిన రాజకీయాలకు వెళ్లిన నటులకు  ఓటర్ల నుంచి చీదరింపు ఎదురైంది. ఒకప్పుడు స్టార్ హీరోలు అంటూ చూసి ఓట్లు వేసే రోజులు పోయాయి. తమకు న్యాయం ఎక్కడ దొరుకుతుందో గమనించాక ప్రజలు ఓట్లు వేస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఎంతో మంది మహా మహా స్టార్స్ రాజకీయాల్లోకి వెళ్లారు. అయితే టాలీవుడ్ నుండి రాజకీయాల్లోకి వెళ్ళిన స్టార్లు అందరికీ ప్రజలనుండి వ్యతిరేకత ఎదురైంది. 

 

 

 

 ఒకప్పుడు స్టార్ హీరోగా ఉన్న సీనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపిస్తే వేగంగా ప్రజాదరణతో ముఖ్య మంత్రిగా ఎదిగారు. ఆయనలాగే ఎదగాలని భావించి రాజకీయాల్లోకి ప్రవేశించారు చాలా మండి మహా  మహా స్టార్లు. కానీ అక్కడ అంతా బెడిసి కొట్టి మళ్ళీ సినిమాల్లోకి వచ్చేశారు. ఇందులో మొదటిది మెగాస్టార్ చిరంజీవి... టాలీవుడ్ లో ఎక్కువ ఫ్యాన్ ఫాలోవింగ్ ఉన్న  హీరోగా చిరంజీవికి మంచి పేరుంది  హార్డ్ వర్క్ తో చాలా మందికి ఇన్సిపిరేషన్ గా ఉంటాడు . ఇక ఈయన ప్రజారాజ్యం పార్టీ పెట్టి ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించారు. కానీ ప్రజారాజ్యం పార్టీకి అంతగా కలిసి రాకపోవడంతో తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి రాజకీయాల నుంచి తప్పుకున్నారు చిరంజీవి. చిరంజీవి రాజ్యసభ సభ్యుడిగా టూరిజం మినిస్టర్ గా కూడా విధులు నిర్వహించారు. ఇక ఆ తర్వాత రాజకీయాల్లో అంతగా కలిసి రాకపోవడంతో మళ్లీ సినిమాల్లోకి వచ్చి సాఫీగా సినిమాలు చేసుకుంటున్నారు. 

 

 

 

 ఇక ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు పవర్ స్టార్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. సరికొత్త ఎజెండాతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి..జనసేన పార్టీ ని స్థాపించాడు.  ఆంధ్ర రాజకీయాలను  బాగానే ప్రభావితం చేశారు పవన్ కళ్యాణ్. దీంతో పవన్ కళ్యాణ్ పక్కాగా మంచి విజయం సాధిస్తాడు అని అందరూ అనుకున్నారు. కానీ నేటి స్వార్థపూరిత సినిమా స్టార్లను తాము నమ్మబోము  అంటూ పవన్ కళ్యాణ్ కు రెండు చోట్ల ఓడించి పార్టీకి ఒక్కటంటే ఒక్క ఎమ్మెల్యే సీట్లు మాత్రమే కట్టబెట్టారు ప్రజలు . అయినప్పటికీ పవన్  రాజకీయాల్లోనే కొనసాగుతున్నారు. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అనే వార్తలు కూడా వస్తున్నాయి. ఒకవేళ సినిమాలు చేస్తే రాజకీయాలకు పూర్తిస్థాయిలో గుడ్ బాయ్ చెబుతారా లేకపోతే రాజకీయాల్లో కొనసాగుతారా అన్నది కూడా ప్రశ్నార్థకంగా మారింది. 

 

 

 

 నటి రోజా కూడా సినిమాలకు పూర్తి స్థాయిలో గుడ్ బై చెప్పేసి పొలిటీషియన్ గా మారిపోయారు. మొదట రోజా కి ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురైనప్పటికీ... ఆ తర్వాత వైసీపీ పార్టీలో చేరిన రోజుకు అదృష్టం కలిసివచ్చింది. 2014లో ఎమ్మెల్యేగా ఎన్నికైన రోజా... ఇక ఇప్పుడు మరోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై.. ఏపీఐఐసీ చైర్మన్గా కూడా పదవీ బాధ్యతలు నిర్వర్తిస్తుంది. ఇప్పటి కాలంలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నటుల్లో బాగా రాణిస్తుంది  రోజా ఒక్కరే అని చెప్పవచ్చు. టాలీవుడ్ మేటి నటి జయప్రద కూడా రాజకీయాల్లోకి ప్రవేశించి తెలుగుదేశం పార్టీలో చేరారు ఆ తర్వాత.. 2004 నుంచి 2014 సమయం వరకు రాజ్యసభ సభ్యురాలిగా నటి జయప్రద పొలిటిషన్ రాణించారు. ఇక అప్పటి నుంచి జయప్రద రాజకీయాలకు దూరమైపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: