ఐటం సాంగులు అనేవి నాటి నుంది నేటి వరకు ప్రతి సినిమాలో కొనసాగుతునే ఉన్నాయి. కాకపోతే కట్టు బొట్టు మారిందంతే. ఇదే కాకుండా ఆ కాలంలో ప్రత్యేక గీతాలకోసం నటీమణులు వేరుగా ఉండేవారు. కాని ఇప్పుడు బట్టలు కరువైన సరే ఐటం సాంగులు చేయడానికి పేరున్న స్టార్ హీరోయిన్స్ కూడా వెనుకాడటం లేదు. ఇకపోతే ప్రస్తుతం ప్రతి సినిమాలోనూ ఐటం సాంగులు తప్పని సరిగా మారాయి. ప్రేక్షకులు కోరుకుంటున్న అంశాల్లో ఐటం సాంగుకు ప్రాధాన్యత ఎక్కువగా ఉండటంతో దర్శక, నిర్మాతలు ప్రతి సినిమాలోనూ మసాలా సాంగు ఉండేలా చూసుకుంటున్నారు.

 

 

గతంలో ఐటం సాంగులు చేయడానికి ప్రత్యేకంగా బి-గ్రేడ్ తారలు ఉండే వారు. వీరు చాలా తక్కువ రేటుకే ఐటం సాంగులు చేసే వారు. అయితే ప్రస్తుతం ట్రెండు మారింది. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కల్పించేందుకు స్టార్ హీరోయిన్లను సైతం ఐటం సాంగులు చేయడానికి ఒప్పిస్తున్నారు. ఇందుకోసం వారికి కోట్లలో రెమ్యూనరేషన్ ఆఫర్ చేస్తున్నారు. రోజుల తరబడి షూటింగులో పాల్గొంటే వచ్చే మొత్తం ఒక ఐటం సాంగు పూర్తి చేస్తే వస్తుండటంతో పలువురు స్టార్ హీరోయిన్లు కూడా ఇలాంటి చేయడానికి  వెనకా ముందు ఆలోచించడం లేదు. అంతే కాకుండా ఐటం సాంగుల్లో అందాల ఆరబోతకు కూడా ఎలాంటి నియమాలు పెట్టకుండా కుర్రకారు నుండి పళ్లూడిన ముసలి వరకు పిచ్చెక్కిస్తున్నారు..

 

 

ఇదే కాకుండా వారు తీసే సినిమాల్లో తప్పని సరిగా ఐటెం సాంగ్ ఉండాలనే నియమాన్ని పెట్టుకున్న దర్శకులు కూడా కొందరు ఉన్నారు. ఇకపోతే  బాలీవుడ్ లో కానివ్వండి హలీవుడ్‌లో కానివ్వండి ఈ మధ్య ఐటం సాంగ్స్ లో నటించిన తారలకు ఎంత క్రేజ్ దక్కినదో అందరికీ తెలిసినదే.. అందుకే ఇప్పుడున్న పరిస్దితుల్లో ఎవరు ఎక్కువగా అందాల ఆరబోత విషయంలో ఒపెన్ గా ఉంటారో అలాంటి వారికి ఐటం సాంగులు ఇవ్వడానికి దర్శకనిర్మాతలు వెనుకాడటం లేదు. ఇకపోతే ఐటెం సాంగులు  చేసే వారికి రెమ్యూనరేషన్ చాలా ఎక్కువ ముట్ట చెబుతుండటంతో పోటీ నెలకొందని చెప్పవచ్చూ..

మరింత సమాచారం తెలుసుకోండి: