ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఎన్ని పార్టీలు ఉన్నా ఆంధ్ర రాజకీయ ముఖ చిత్రం రెండు పార్టీల చుట్టూ తిరుగుతుంది. ఆ రెండు పార్టీలు వైసిపి వర్సెస్ టిడిపి. ఎటువంటి జాతీయ పార్టీ అయిన మరే ఇతర పార్టీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న గని అవి పెద్దగా ప్రజలను ఏమాత్రం ప్రభావితం చేయలేని స్థితిలో ప్రస్తుతం ఉన్నాయి. అయితే ఈ రెండు పార్టీల మధ్య పరిస్థితి పచ్చగడ్డి పై అగ్గిపుల్ల వేస్తే బొగ్గు అన్నట్టుగా ముందు నుండి వాతావరణం అలానే ఉంది. రాజకీయంగా చంద్రబాబు ని మరియు తెలుగుదేశం పార్టీని ప్రస్తుతం వైసిపి పార్టీ అధ్యక్షుడు జగన్ ముప్పుతిప్పలు పెడుతున్నారు. 2014 ఎన్నికల్లో అధికారం కోల్పోయిన ..2019 ఎన్నికల్లో భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన జగన్...40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు కి దిమ్మతిరిగిపోయే విధంగా ఓటమి అంటే ఏంటో మతిపోయేలా రాజకీయాన్ని చేసి తెలుగుదేశం పార్టీకి చావుదెబ్బ కొట్టడం జరిగింది.

 

కొద్దిపాటి లో ప్రతిపక్షంలో ఉండి బతికిపోయిన చంద్రబాబు కి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయాలని అధికార పార్టీ వైసీపీ ప్రస్తుతం ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి రాజీనామా చేయించి తీసుకురావడానికి ప్రయత్నాలు మరోపక్క జరుగుతున్నాట్లు ఏపీ రాజకీయాల్లో టాక్. ఇటువంటి తరుణంలో చంద్రబాబు బావ బాలకృష్ణ వైసిపి పార్టీ ఫైర్ బ్రాండ్ రోజా తో చేతులు కలిపినట్లు ఏపీ జనాలు మాట్లాడుకుంటున్నారు.

 

విషయంలోకి వెళితే ప్రస్తుతం వైసీపీ మరియు టిడిపి పార్టీ ల మధ్య పరిస్థితి చాలా దారుణంగా ఉంది అసెంబ్లీలో ఒకరిపై ఒకరు చాలా దారుణమైన విమర్శలు చేసుకున్నారు. ఇదే తరుణంలో అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు ని ఆయన రాజకీయ జీవితాన్ని తీవ్రమైన విమర్శలతో ఏపీ శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో కడిగిపారేసిన నగరి ఎమ్మెల్యే వైసీపీ పార్టీ ఫైర్ బ్రాండ్ రోజాకు బాలకృష్ణ తన సినిమాలో చాన్స్ ఇవ్వటంతో ఇది చంద్రబాబు కి షాక్ ఇచ్చినట్లే అని అంటున్నారు ఆంధ్ర ప్రజలు.

మరింత సమాచారం తెలుసుకోండి: