మరి కొద్దిరోజుల్లో 2019 సంవత్సరానికి శుభం కార్డు పడి 2020 సంవత్సరం ప్రారంభం కానుంది. 2020 అనేది మరో దశాబ్దానికి ప్రారంభం అవుతుంది. అంటే 2010 నుంచి చూసుకుంటే...ఇప్పటివరకు ఒక దశాబ్దం ముగిసింది. అయితే ఈ దశాబ్ద కాలంలో తెలుగుచిత్రసీమ అనేక కొత్త హంగులని చూపించింది. ఇక టాలీవుడ్లో బాహుబలి లాంటి చిత్రం సరికొత్త చరిత్రనే సృష్టించింది. ఇక ఈ దశాబ్ద కాలం లో బాగా క్లిక్ అయినా టెక్నీషియన్లు గురించి ఒక్కసారి మాట్లాడుకుంటే.... మొదట సంగీతం గురించి చెప్పుకోవాలి.

 

సంగీతంలో ఈ 10 ఏళ్ల లో టాలీవుడ్ ని దేవిశ్రీ ప్రసాద్, ఎస్ ఎస్ థమన్ లే ఎక్కువగా కనిపించారు.వీరిద్దరూ ఎక్కువ సినిమాలకు సంగీతం సమకూర్చారు. ఇక వీరి తర్వాత మలయాళ మ్యూజిక్ దర్శకుడు గోపి సుందర్ ఎక్కువ కనిపించాడు. అలాగే సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్లు కీరవాణి, మణిశర్మ, కోటి  లాంటి  వారు కొన్ని సినిమాలకే పని చేసారు. అటు యువ సంచలనం అనిరుద్ధ్ కూడా బాగానే సందడి చేసాడు. 

 

ఇక రెహమాన్ లాంటి వారు డబ్బింగ్ సినిమాలకే పరిమితమయ్యారు. అటు చిరంతన్ భట్ కూడా తెలుగు చిత్రసీమ లో ప్రవేశించారు.  అటు సినిమాటోగ్రాఫర్లు విషయానికొస్తే ఈ దశాబ్దంలో అద్భుతంగా పేరు సంపాదించింది. కేకే సెంథిల్ కుమార్. బాహుబలి చిత్రానికి పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కించిన సాహో లాంటి చిత్రానికి పని చేసి 'మది' కూడా మంచి మార్కులే కొట్టేసాడు. అలాగే సి రామ్ ప్రసాద్, చోటా కె నాయుడు లాంటి వారు తెలుగు చిత్రసీమలో అగ్ర కెమెరా మెన్లుగా నిలిచారు.

 

అలాగే ఎడిటర్లలో కోటగిరి వెంకటేశ్వరరావు, గౌతంరాజు, మార్తాండ్ కె వెంకటేష్ లు తమ సీనియారిటీని నిరూపించుకోగా, వీరికి పోటీగా కొందరు జూనియర్లు కూడా బాగానే పని చేస్తూ వచ్చారు. ఇక ఫైట్ మాస్టర్లలో పీటర్ హెయిన్స్, రామ్ లక్ష్మణ్ మాస్టర్లు ఇప్పటికి సత్తా చాటుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: