తెలుగు సినిమా వెండితెరపై ఈ దశాబ్దంలో ఎంతోమంది దర్శకులు తమ ప్రతిభను నిరూపించుకునేందుకు తమ వంతు ప్రయత్నం చేయగా కొంతమంది యువ దర్శకులు తమ ఆరంగ్రేటాన్ని ఘనంగా చాటాడు. అయితే ప్రతి ఒక్కరూ పాట డైరెక్టర్లు నిర్దేశించిన దారిలోనే నడవగా ట్రెండ్ సెట్టర్లు మాత్రం కొద్దిగా తమ శైలికి భిన్నంగా ప్రయత్నించి సఫలమయ్యారు. ఒక్క సందీప్ రెడ్డి వంగా ను మినహాయిస్తే మిగతా వారంతా త్రివిక్రమ్, పూరి జగన్నాథ్, సుకుమార్, మారుతీ, శేఖర్ కమ్ముల వంటి అనేక క్యాటగిరీలకు చెందిన డైరెక్టర్లను అనుసరించారు అన్నది వాస్తవం.

 

ముందుగా త్రివిక్రమ్ లాగా ఒక మంచి సబ్జెక్ట్ ను ఎలివేట్ చేస్తూ అటు సినిమా వ్యాపార అవసరాలను మరియు ఇటుపక్క ప్రేక్షకుడికి అందించవలసిన మెసేజ్ మరియు బాధ్యతను ఒకేసారి కన్వే చేయడం ఎవరి వల్ల కాదు అనే చెప్పాలి. ఈ దశాబ్దంలో జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అత్తారింటికి దారేది, అ...ఆ వంటి ఎన్నో విలక్షణమైన చిత్రాలతో త్రివిక్రమ్ తానేంటో నిరూపించుకోగా అజ్ఞాతవాసి లాంటి భారీ డిజాస్టర్ తర్వాత తన పంథా మార్చుకొని మొట్టమొదటిసారి ఒక మాస్ సినిమా 'అరవింద సమేత' ను ఎన్టీఆర్ తో తీసి తనలో కొత్త యాంగిల్ ను ప్రేక్షకుల ముందు పెట్టాడు.

 

లేకపోతే పూరి జగన్నాథ్ ఈ దశాబ్దంలో ఎదుర్కొన్న గడ్డు పరిస్థితిని మరే డైరెక్టరు కనీసం తన కలలో కూడా ఊహించి ఉండడు. ఏ సినిమా తీసినా అడ్రస్ లేకుండా పోతున్న తరుణంలో పూరి ఈ దశాబ్దపు చివరి సంవత్సరంలో రామ్ తో తీసిన 'ఇస్మార్ట్ శంకర్' మాత్రం మణిశర్మ బ్రహ్మాండమైన మ్యూజిక్ చొరవతో భారీ హిట్ ను సాధించింది. ఇక సుకుమార్ '1' లాంటి ప్రత్యేకమైన సినిమా తర్వాత 'కుమారి 21ఎఫ్' కు తన రచనా సేవలు అందించి తర్వాత తారక్ తో 'నాన్నకు ప్రేమతో' తీసి తనలో ఉన్న క్లాస్ స్క్రీన్ప్లే డైరెక్టర్ ను అందరికీ పరిచయం చేశాడు.

 

అయితే మాస్ ను మొట్టమొదటిసారిగా రామ్ చరణ్ తో ప్రయత్నించిన సుకుమార్ ఒక్కసారిగా 'రంగస్థలం' లాంటి భారీ బ్లాక్ బస్టర్ తో నాన్ బాహుబలి రికార్డు పెట్టేసాడు. ఇక మారుతి 'భలే భలే మగాడివోయ్' సినిమా తో కామెడీ లో ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేయగా ఆ తర్వత రొటీన్ కాన్సెప్ట్స్ తో బోర్ కొట్తించినా... 'మహానుభావుడు' తో పర్వాలేదనిపించాడు. చివరికి శేఖర్ కమ్ముల ఎప్పటిలాగే సినిమా సినిమాకు కావాల్సిన సమయం తీసుకుంటూ తన ప్రతి ఒక్క చిత్రాన్ని అందంగా మేళవించు కుంటూ వస్తున్నాడు. తను తీసిన 'ఫిదా' అయితే కుర్రకారు ఎమోషన్స్ ని ఒక రేంజ్ లో ఎలా చూపించాలో అందరికీ తెలియజేసింది.

 

మొత్తానికి త్రివిక్రమ్ సామాజిక బాధ్యత, పూరి ముక్కుసూటిగా మాట్లాడే మాటలు, సుకుమార్ అనంతమైన తెలివి, మారుతి యొక్క వెటకారం మరియు శేఖర్ కమ్ముల యొక్క సౌమ్యత మొత్తం కలిపి టాలీవుడ్ యువ దర్శకులకు కావాల్సినంత మార్గదర్శకత్వాన్ని ఐదుగురు కల్పిస్తున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: