జూనియర్ ఎన్టీయార్ టాలీవుడ్ లో ప్రస్తుతం వరుస విజయాలు అందుకుంటున్న హీరో. 1991 సంవత్సరంలో బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాలో చిన్న పాత్రతో సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీయార్, ఆ తరువాత గుణ శేఖర్ దర్శకత్వంలో బాల రామాణయం సినిమాలో  లీడ్ రోల్ లో నటించాడు. హీరోగా నిన్ను చూడాలని సినిమాతో కెరీర్ మొదలు పెట్టిన జూనియర్ కు తొలి సినిమా ఫలితం నిరుత్సాహాన్ని మిగిల్చింది.

 

 

తరువాత రాజమౌళి జూనియర్ కాంబోలో తెరకెక్కిన స్టూడెంట్ నంబర్ 1 బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కానీ అదే సంవత్సరం విడుదలైన సుబ్బు సినిమా డిజాస్టర్ ఫలితాన్ని అందుకుంది. ఆది సినిమాతో మరో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్న జూనియర్ అల్లరి రాముడు సినిమాతో యావరేజ్ హిట్ అందుకున్నాడు. ఈ రెండు సినిమాల తరువాత వచ్చిన నాగ సినిమా జూనియర్ కెరీర్లో భారీ డిజాస్టర్ గా మిగిలింది. తరువాత సింహాద్రితో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టిన జూనియర్ కు ఆంధ్రావాలా సినిమా రూపంలో భారీ షాక్ తగిలింది.

 

 

సాంబ సినిమా యావరేజ్ ఫలితాన్ని అందుకోగా నా అల్లుడు, నరసింహుడు సినిమాలు నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చాయి. అశోక్, రాఖీ సినిమాలు యావరేజ్ ఫలితాన్ని అందుకోగా యమదొంగతో జూనియర్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. కంత్రి లో యావరేజ్ ఫలితాన్ని అందుకోగా అదుర్స్, బృందావనం సినిమాలు హిట్ అయ్యాయి. మెహర్ రమేశ్ దర్శకత్వంలో తెరకెక్కిన శక్తి డిజాస్టర్ ఫలితాన్ని అందుకోవటంతో పాటు నిర్మాతకు భారీ నష్టాలను మిగిల్చింది. ఊసరవెల్లి బిలో యావరేజ్ ఫలితాన్ని అందుకోగా దమ్ము డిజాస్టర్ అయింది. జూనియర్ శ్రీను వైట్ల కాంబోలో తెరకెక్కిన బాద్ షా సినిమాకు హిట్ టాక్ వచ్చినా భారీ బడ్జెట్ తో నిర్మించటంతో కాస్ట్ ఫెయిల్యూర్ గా మిగిలింది.

 

 

రామయ్య వస్తావయ్యా, రభస సినిమాలు కూడా డిజాస్టర్ ఫలితాన్ని అందుకున్నాయి. టెంపర్ సినిమా నుండి జనతా గ్యారేజ్, నాన్నకు ప్రేమతో, ‘జై లవకుశ’ తాజాగా అరవింద సమేత సినిమాలన్నీ హిట్ అయ్యాయి. అరవింద సమేత జూనియర్ కెరీర్ లో మరో బాక్స్ ఆఫీస్ హిట్ గా నిలిచింది. వరల్డ్ వైడ్ గా 100 కోట్ల గ్రాస్ అందుకొని తెలుగులో బాహుబలి తరువాత స్పీడ్ గా కలెక్షన్స్ ను అందుకున్న చిత్రంగా నిలిచింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎవరు ఊహించని స్థాయిలో కలెక్షన్స్ అందాయి. మొదటి రోజే సినిమా కొన్ని ఏరియాల్లో నాన్ బాహుబలి రికార్డ్స్ అందుకుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: