సినిమా థియేటర్స్ రాజకీయాలు ఇప్పటివి కావు. ఎప్పటి నుంచో చాలామంది సినిమా థియేటర్ల విషయంలో గుత్తాధిపత్యాన్ని చూపిస్తున్నారు .  థియేటర్ ల పై గుత్తాధిపత్యం కోసం బడా నిర్మాతలు చిన్న నిర్మాతల మధ్య వివాదాలు జరుగుతూనే ఉంటాయి. దశాబ్ద కాలం నుంచి థియేటర్ రాజకీయాలు ఎక్కువ అయినట్లు కనిపిస్తోంది. ఎన్నో ఏళ్ల నుంచి థియేటర్ల పై బడా నిర్మాతల  ఆధిపత్యం కొనసాగుతూనే ఉంది. బడా నిర్మాతలు గుత్తాధిపత్యం కింద చిన్న నిర్మాతలు చిన్న సినిమాలు నలిగిపోతునే  ఉన్నాయి. బడ నిర్మాతల  సినిమా వచ్చిందంటే సదరు థియేటర్లో చిన్న సినిమా ఎంత మంచి వసూళ్ళు రాబడుతునప్పటికీ.. చిన్న సినిమా తీసేసి బడా నిర్మాతల  సినిమాను ఆడిస్తున్నారు . దీని వల్ల చిన్న నిర్మాతలు చిన్న సినిమాలు నష్టాల బారిన పడుతున్నాయి. 

 

 

 ఇక టాలీవుడ్ లో ఉన్న థియేటర్లన్నీ టాలీవుడ్ బడా నిర్మాతలైన  సురేష్ బాబు,  అల్లు అరవింద్, ఏసియన్ సినిమాస్, దిల్ రాజు లాంటి కొంతమంది బడా బడా నిర్మాతల చేతుల్లోనే ఉన్నాయన్న విమర్శలు కూడా గత దశాబ్ద కాలం నుండి వినిపిస్తూనే ఉన్నాయి. బడా నిర్మాతలు అందరూ చిన్న సినిమాల విషయంలో నిర్థాక్షిణ్యంగా నే ప్రవర్తిస్తున్నారు అన్న విమర్శలు కూడా చాలాసార్లు వినిపించాయి. టాలీవుడ్ బడా నిర్మాతలు అందరూ  చిన్న సినిమాలను బతకనివ్వటం  లేదని... కనీస వసుళ్ళు  కూడా రాకుండా చేస్తున్నారు అంటూ విమర్శలు వస్తూనే ఉన్నాయి. చిన్న సినిమాలకు భారీగా రెడ్ రెంట్ పెంచేసి... ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇక బడా నిర్మాతలు సినిమాలు విడుదలైతే మాత్రం వందలాది థియేటర్లలో సినిమాలు ఆడించి ఓపెనింగ్ కుమ్మేకుంటున్నారు టాలీవుడ్ బడా నిర్మాతలు. దీంతో సినిమా బాలేకపోయినా ఫ్లాప్ అయినా బడా నిర్మాతలకు మాత్రం వసూలు వస్తూనే ఉంటాయి.

 

 

 చిన్న సినిమాల విషయానికొస్తే.. ఆ సినిమా ప్రేక్షకులకు ఎంత ఆకర్షించిన .. సినిమా చూడడానికి ప్రేక్షకులు థియేటర్లకు బారులు తీరుతున్న.. సినిమాలు కలెక్షన్ల పరంగా కూడా దూసుకుపోతున్న.. బడా నిర్మాతలు సినిమా వచ్చిందంటే ఆ సినిమా థియేటర్ నుంచి అవుట్ అవ్వాల్సిందే. చిన్న సినిమాకి కథ పరంగా మంచి టాక్ వచ్చినప్పటికీ వసూల్ల  పరంగా  మాత్రం చిన్న సినిమాలు నష్టపోతూనే ఉన్నాయి . అంతే కాకుండా చిన్న నిర్మాతలు ఎంత మంచి కథతో సినిమా చేసిన.. వాటిని తక్కువ రేట్ కి అమ్ముకోవాల్సిన పరిస్థితులు ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నాయని చోట నిర్మాతలు అంటున్న మాట. థియేటర్ల రాజకీయాలు రోజురోజుకు పెరిగి పోయి.. చిన్న నిర్మాతలు సినిమాలు తీయలేని పరిస్థితి నెలకొంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: