స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి దేశవ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతని చిత్రం డిజిటల్ మీడియాలో విడుదల అయింది అంటే చాలు అతని డబ్బింగ్ సినిమాలకు కొన్ని మిలియన్ల వ్యూస్ వచ్చినట్లు మరే సౌత్ ఇండియన్ హీరో సినిమాకి కూడా రావు. అయితే తాను ఎప్పుడూ చిరంజీవి అడుగుజాడల్లో నడుస్తానని... ఎప్పటికైనా ఆయనే తన హీరో అని చెప్పుకునే అల్లుఅర్జున్ ప్రస్తుతానికి మెగా కుటుంబానికి దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే కేవలం సినిమాల పరంగానే రామ్ చరణ్ తో బన్నీ కోల్డ్ వార్ నడుపుతున్నాడట. 

 

అంతకుముందు జరిగిన సైరా రిలీజ్ ఫంక్షన్ కు కూడా అతను రాకపోవడం మరియు అందుకు సంబంధించి ఎంతో మంది ఎన్నో ప్రశ్నలు అడిగినా సరిగ్గా వివరణ ఇవ్వక పోవడం చూస్తుంటే ప్రస్తుతం వస్తున్న గాసిప్స్ నిజమనే అనిపిస్తున్నాయి. అంతేకాకుండా తన కొడుకు ఫ్యూచర్ కోసం దర్శకులతో చాలా సీరియస్ గా డిస్కషన్ చేస్తూ మంచి కథలు వస్తే ముందుగా అల్లు అర్జున్ కోసమే రామ్ చరణ్ ను అల్లు అరవింద్ సైడ్ చేస్తున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అందుకే స్వయంగా చిరంజీవిని రంగంలోకి దిగి 'రంగస్థలం' సినిమా నుండి కావాలని తానే స్వయంగా చరణ్ సినిమాలన్నింటికీ కథలు విని ఓకే చేస్తున్నాడు అని అంటున్నారు.

 

ఇకపోతే తెలుగు చిత్రసీమలో తాను ఎన్ని దశాబ్దాలు కొనసాగినా మెగాఫ్యామిలీ నీడలోనే ఉండాల్సి వస్తుందని తనకంటూ బయట కూడా సొంత ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటున్నాడు అని ప్రచారం జరుగుతోంది. గతంలో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాలి అన్నప్పుడు కాంట్రవర్సీ గా అతను అన్న మాటలు మరియు సైరా సినిమా విషయంలో అసలు అతను ఏ మాత్రం ఆసక్తి చూపని విధానం చూస్తుంటే చెర్రీతో అతనికున్న గొడవ గురించి జరుగుతున్న ప్రచారం ఒక కోణంలో నిజమే అని ఎవరికైనా అనిపిస్తుంది. మొత్తానికి ఈ ప్రచారం ఆగాలంటే ఇద్దరిలో ఎవరో ఒకరు అతి త్వరలో ఒక సానుకూలమైన అడుగు ముందుకు వేయక తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి: