పవన్ కళ్యాణ్ హీరోగానే కాదు జనసేన అధినేతగా జనాల్లో క్రేజ్ ఉంది. హీరోగా సూపర్ సక్సెస్ అయిన పవన్ కళ్యాణ్ రాజకీయ నేతగా మాత్రం సక్సెస్ అవలేదు. ఎలక్షన్స్ రిజల్ట్ తో మైండ్ బ్లాక్ అయిన పవన్ తన పార్టీ కార్యచరణ కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం కాకినాడలో రైతుల క్షేమం కోసం రైతు సౌభాగ్య దీక్ష చేపట్టారు. ఈ దీక్ష సమయంలో రాజమండ్రిలో ఫ్లైట్ ఆలస్యమని తెలిసి అక్కడ ఓ అభిమాని ఇంటి ముందు నేల మీద సేదతీరాడు పవన్ కళ్యాణ్.

 

పవన్ నేల మీద పడుకోవడంపై రకరకాల కామెంట్స్ వచ్చాయి. అయితే పవన్ అలా నేల మీద పడుకున్న ఫోటోని ఆయన అంటే పడని కొందరు ఫోటో ఎడిట్ చేసి కాస్టింగ్ కౌచ్ కోసం శ్రీరెడ్డి ఫిల్మ్ చాంబర్ దగ్గర చేసీన్ అర్ధ నగ్న ప్రదర్శనకు జత చేశారు. కూర్చుని ఉన్న శ్రీరెడ్డి ఒళ్లో పవన్ పడుకున్నట్టుగా పవన్ ఫోటో పెట్టారు. అయితే దీనిపై శ్రీ రెడ్డి గట్టిగా వాయించేస్తుంది.

 

ఈ ఫోటో తన ఫేస్ బుక్ లో చూసిన శ్రీ రెడ్డి ఏదిరా ఇది.. మీ బొందపెట్ట.. నా ఒళ్లో పవన్ కళ్యాణ్ ను పడుకోబెట్టారేట్రా.. నాయనో నన్ను కొంపతీసి ఐదో పెళ్లాం అంటే.. మా బాస్ దగ్గర నా పరువేం కావాలి.. అంటూ కామెంట్ చేసింది. పవన్ పై కామెంట్స్ చేయడంలో ఎప్పుడు ముందుండే శ్రీ రెడ్డి తన ఒళ్లో పవన్ ఫోటోని చూసి మరింత రెచ్చిపోయింది.

   

అయితే శ్రీ రెడ్డి కామెంట్స్ ప్రకారం పవన్ కు ఐదో పెళ్లాన్నా అనడం హాట్ టాపిక్ గా మారింది. మాములుగా శ్రీ రెడ్డి నాలుగో పెళ్లాం కదా అనాల్సింది మరి ఐదో పెళ్లాం అని ఎందుకన్నది అని ఆరా తీస్తున్నారు. మొత్తానికి ఎవడో ఎడిట్ చేసిన ఫోటోకి పవన్ మీద శ్రీ రెడ్డి విరుచుకు పడటం హాట్ న్యూస్ గా మారింది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: