టాలీవుడ్ లో రాం హీరోగా దేవదాస్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తక్కువ కాలంలోనే సౌత్ ఇండియా సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా పేరు దక్కించుకున్న గోవా బ్యూటి ఇలియానా. మహేష్ బాబు, అల్లు అర్జున్, ఎన్.టి.ఆర్, ప్రభాస్, రవితేజ.. సహా స్టార్ హీరోలందరి సరసన నటించి సౌత్ లో మొదటి కోటి పారితోషికం తీసుకున్న బ్యూటీగా ఇలియానా రికార్డ్ ని క్రియోట్ చేసింది. సౌత్ లో ఫుల్ ఫామ్ లో ఉన్న సమయంలోనే బాలీవుడ్ ఫ్లైట్ ఎక్కిన ఈ గోవా బ్యూటి అక్కడ రెండు మూడు సంవత్సరాలు బాగానే గడిపింది. కాని ఆ తర్వాత కష్టకాలం మొదలైంది. బాలీవుడ్ లో ఆఫర్స్ లేక డైరీ ఖాళీ  అయింది. దాంతో మళ్ళీ సౌత్ కి రావాలని ట్రై చేసినప్పటికి వర్కౌట్ అవలేదు. 

 

సౌత్ ఆడియన్స్ తో పాటు ఫిల్మ్ మేకర్స్ ఇలియానా మీద పెద్దగా ఆసక్తి చూపించలేదు. కానీ మాస్ రాజా రవితేజ మాత్రం ఇలియానాకు అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాతో ఛాన్స్ ఇచ్చాడు. ఆ సినిమా ఇలియానాకు నిరాశ పరిచింది. దానికి తోడు ఆ సినిమాలోని ఆమె లుక్ పై విమర్శలు వచ్చాయి. దాంతో తెలుగులో ఇలియానా కెరీర్ దాదాపుగా క్లోజ్ అయినట్లేనని తెలుస్తోంది. తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా ఇలియానాకు మళ్లీ ఆఫర్లు రావడం కష్టమే అంటూ నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సమయంలో తమిళ స్టార్ హీరో అజిత్ ఇలియానాకు ఛాన్స్ ఇచ్చి అందరికి షాకిచ్చాడు.

 

అజిత్సినిమా చేసినా కూడా హీరోయిన్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాడు. సీనియర్ హీరోయిన్స్ కోసం అజిత్ చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఇప్పటికే సీనియర్ హీరోయిన్స్ అందరితోనూ వర్క్ చేశాడు. అయితే తాజాగా అజిత్ దృష్టి ఇలియానాపై పడ్డట్లుగా సమాచారం. వినోద్ దర్శకత్వంలో రూపొందుతున్న అజిత్ మూవీకి ఇలియానా హీరోయిన్ గా దాదాపుగా కన్ఫర్మ్ అయినట్లే అంటూ కోలివుడ్ సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.

 

అజిత్ తో సినిమా ఆఫర్ రావడంతో ఈ గోవా బ్యూటి బరువు తగ్గేందుకు విపరీతంగా ప్రయత్నాలు చేస్తోందట.  ఇప్పటికే బరువు కాస్త తగ్గిందని ఆమె లుక్స్ చూస్తే తెలుస్తోంది. అయితే మరింతగా బరువు తగ్గి రీ ఎంట్రీ ఇవ్వాలని ప్లాన్ చేసుకుంటుందట. ఇక ఈ సినిమా ఇలియానాకు లాస్ట్ ఛాన్స్ అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా రిజల్ట్ గనక పాజిటివ్ అయితే మళ్ళీ వరుస అవకాశాలతో ఇండస్ట్రీలో కంటిన్యూ గా ఉంటుంది. లేదు అంటే ఇలియానాకు ప్రేక్షకులు పూర్తిగా గుడ్ బై చెప్పడం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: