తెలుగు ఇండస్ట్రీలో సింగిల్ టేక్ హీరో అని అందరూ చెప్పుకునే ఒకే ఒక్క హీరో జూనియర్ ఎన్టీఆర్. తాత గారు నందమురి తారక రామారావు నుండి అన్ని లక్షణాలని పుణికి పుచ్చుకున్న తారక్ తెలుగు హీరోలందరిలో తన రూట్ వేరంటూ సెపరేట్ గా దూసుకుపోతున్నాడు. అయితే తారక్ మొదటి సినిమా నిన్ను చూడాలని నుండి ఇప్పటి వరకు ఆయన ప్రయాణం సజావుగా సాగలేదు. ఎన్నో ఒడిదొడుకులు వచ్చాయి.

 

మధ్యలో ఎన్నో సవాళ్ళు, ఒత్తిళ్ళు అయినా వాటన్నింటిని తట్టుకుని నిలబడుతున్నాడు. మొదటి సినిమా ఫ్లాప్ అయినా ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన స్టూడెంట్ నంబర్ వన్ చిత్రం తనకి విజయాన్ని అందించింది. ఆ తర్వాత వచ్చిన ఆది, సింహాద్రి చిత్రాలు తారక్ కెరీర్లో బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. ఆ తర్వాత ఎన్టీఆర్ శరీరం మీద అనేక విమర్శలు వచ్చాయి. ఆ విమర్శలన్నింటినీ తిప్పి కొడుతూ సన్నగా మెర్రుపుతీగ వలే కనిపించి అందరికీ షాక్ ఇచ్చాడు.

 


అభిమానులు తమ హీరోని ఎలా చూడాలనుకుంటున్నారో అర్థం చేసుకుని అలా రెడీ అవ్వడానికి ఎన్టీఆర్ సిద్ధంగా ఉంటాడు. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న సమయంలో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన యమదొంగ ఒక ఊపు ఊపేసింది. ఆ సినిమాలో యముడిగా తారక్ చేసిన ప్రదర్శన వారి తాత గారిని గుర్తు చేసింది. ఇలా ఒకటి కాదు రెండు కాదు తారక్ తన అభిమానుల కోసం ఎన్నో చేశాడు.

 

అలాగే రాజకీయంగా ఎన్నో ఒత్తిళ్ళు వస్తున్నప్పటికీ వాటన్నింటినీ తట్టుకుని నిలబడుతున్నాడు. నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీ కోసం ప్రచారమ్ చేసిన సంగతి కూడా తెలిసిందే. ఇలా ఒకటేమిటి ఎన్ని అడ్డంకులు ఎదురైనా తన ప్రయాణాన్ని సాఫీగా సాగిస్తున్నాడు తారక్. తారక్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్.ఆర్.ఆర్ అనే సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: