కొడుకు పుట్టగానే సంబర పడిపోతే కాదు. అతను పెరిగి పెద్దవాడై తల్లిదండ్రుల పేరుప్రతిష్టలను నిలిపి వారి గౌరవాన్ని కాపాడినప్పుడు మాత్రమే కన్న వారికి గౌరవం. పుట్టినవాడి జన్మ సార్ధకం అని పెద్దలు అంటారు. ఈ లోకంలో ఎందరో మగపిల్లాన్ని కనాలని కలలు కంటారు. అలా కలలు కన్న వారు మగపిల్లాన్ని కన్నారు కాని ఆ మగవాడిగా పుట్టిన వ్యక్తుల్లో ఎంతమంది తమ తల్లిదండ్రుల పట్ల మర్యాదగా నడుచుకుంటూ, వారిని తలెత్తుకునేలా చేస్తున్నారని పరిశీలిస్తే అందులో కొందరు మాత్రమే కనిపిస్తారు. ఆ కొందరిలో మహేష్ బాబు ఒకరు..

 

 

ఒకప్పుడు మహేష్ ఎక్కడికైన వెళ్లినా, లేదా చిన్నవయస్సులో స్కూల్లో చదువుకునే రోజుల్లో అయినా నేను కృష్ణగారి అబ్బాయిని అని సగర్వంగా చెప్పుకునే వారు. కాలేజీ డేసుల్లో కూడా నటుడు సూపర్ స్టార్ కృష్ణగారి అబ్బాయిలానే ట్రీట్ చేసేవారు కాని రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవు కదా. మహేష్ సినిమాల్లోకి హీరోగా ఎంటరవ్వడం క్రమక్రమంగా తన నటనలోని లోపాలను సరిచేసుకుంటూ ఈ రోజు వెనక్కు తిరిగి చూసుకుంటే తానొక సూపర్ స్టార్ కొడుకు అన్న విషయం కంటే, సూపర్ స్టార్ మహేష్ బాబు తండ్రి కృష్ణగారు అని చెప్పుకునే స్దాయికి ఎదిగారు.

 

 

ఇది చాలదా ఒక తండ్రికి నిజమైనా పుత్రోత్సాహం.. మహేష్ బాబు వ్యక్తిత్వంలో గాని, వ్యక్తిలో గాని ఎలాంటి మార్పు ఉండదు. సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా, నటీనటులు, డైరెక్టర్స్ కొత్తవారైనా, పాతవారైన తన పని తాను క్రమశిక్షణతో చేసుకుంటూ వెళ్ళడమే అతని తెలిసిన విద్య. అటు ఓ తండ్రికి కొడుకుగా, తన కర్తవ్యాన్ని నిర్వహిస్తూనే, భార్యకు భర్తగా, ఇద్దరు పిల్లల తండ్రిగా, తెరపైన నటుడిగా తనదైన ముద్ర వేసారు మహేష్ బాబు. ఎక్కడి రాజకుమారుడు, మురారి, ఇప్పుడు పోకిరి, శ్రీమంతుడు తాజాగా సరిలేరు నీకెవ్వరు అని అనిపించుకునే స్దాయి మహేష్ బాబుదని అతని అభిమానులు అభిప్రాయ పడుతున్నారు.. ఇదేకదా తన బిడ్దల నుండి ఒక తండ్రి ఆశించే ప్రతిఫలం.    

మరింత సమాచారం తెలుసుకోండి: