రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్. జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లొ భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న చిత్రం కావడంతో ఆ అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ డెభ్బై శాతం పూర్తి అయిందని అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలొ ఎన్టీఆర్, రామ్ చరణ్ ల లుక్ కోసం ఎంతో మంది వెయిట్ చేస్తున్నారు.

 

కొమరం భీమ్ గా ఎన్టిఆర్ లుక్ ఎలా ఉంటుందో ఊహించి ఇంటర్నెట్ లో వదిలిన సంగతి తెలిసిందే. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ లుక్ కూడా ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతోంది. అయితే ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ కొద్దిరోజులుగా విశాఖలోని ఏజెన్సీ ప్రాంతంలో జరుగుతుంది. ఈ షూటింగ్ షెడ్యూలు కొరకు ఇటీవలే ఎన్టీఆర్ వైజాగ్ వెళ్లడం జరిగింది. కాగా మన్యం వేదికగా ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నైజాం పాలకులను ఎదిరించే సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారట.

 

 పోడు వ్యవసాయం చేసే తెగల కష్టనష్టాలు, నిజాం వారి సైన్యం పై ఆయన గెరిల్లా యుద్దాలు వంటి కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారని సమాచారం. వారం రోజులుగా ఈ షెడ్యూలు జరుగుతుండగా చివరి దశకు చేరుకుందని సమాచారం. ఈ షూటింగ్ లో ఎన్టీఆర్ ఒక్కడే పాల్గొన్నాడట. మరి రామ్ చరణ్ కూడా పాల్గొంటాడా లేడా అన్నది తెలియాలి. రాజమౌళి అత్యంత జాగ్రత్తగా ఈ సినిమాని డీల్ చేస్తున్నాడట.

 

ఎన్టీఆర్ కి జొడీగా బ్రిటీష్ నటి ఒలివియా మోరిస్ నటిస్తుండగా, రామ్ చరణ్ సరసన ఆలియా భట్ చేస్తుంది. అలాగే కొందరు హాలీవుడ్ద్ నటులతో పాటు బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ ఈ సినిమాలో కనిపించనున్నాడు. ఈ చిత్రం వచ్చే ఏడాది జులై ౩౦  వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా పది భాషల్లో విడుదల అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: