టాలీవుడ్‌లో హీరో డైరెక్టర్‌ రిపీట్‌ కాంబినేషన్స్‌ చూసుంటాం… కొత్త సంవత్సరం రాబోతుంది.. కొత్త కొత్త కాంబినేషన్స్ సెట్స్‌పైకి వస్తున్నాయి.. మిమ్మల్ని అలరించే సినిమాలు సిద్ధం కాబోతున్నాయి. న్యూ ఇయర్ లో రాబోతున్న క్రేజీ కాంబినేషన్స్ ఏంటి..? కొత్త ఏడాది టాలీవుడ్‌ ప్రేక్షకులు కనువిందు చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. అభిమానుల అంచనాలను రెట్టింపు చేసే విధంగా సూపర్ క్రేజీ కాంబినేషన్స్‌తో సినిమాలు రెడీ అవుతున్నాయ్..వాటిలో ముందుగా చెప్పుకోవాల్సిన క్రేజీ కాంబినేషన్ సూపర్ స్టార్ మహేష్- రాజ్‌, డీకే.. ఇప్పటికే బాలీవుడ్‌లో పలు సినిమాలు చేసిన వీరు.. డి ఫర్ దోపిడి సినిమాతో టాలీవుడ్‌లో ప్రొడక్షన్ రంగంలో అడుగుపెట్టారు. ఇప్పుడు వీరి డైరెక్షన్‌లో నటించేందుకు మహేష్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం. ఇక ఎన్.టి.ఆర్ విషయానికొస్తే సుకుమార్ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడని అనౌన్స్ మెంట్ వచ్చింది. సాధారణంగా ఒక హిట్ సినిమా తీస్తే ఆ డైరక్టర్ తో నెక్ష్ట్ సినిమా ప్లాన్ చేయడం ఎన్.టి.ఆర్ అలవాటే కాబట్టి తన నెక్ష్ట్ ప్రోజెక్ట్ సుకుమార్ తో చేయడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం సుకుమార్ మహేష్‌తో వన్ సినిమా చేస్తున్నాడు. ఇక ఎన్.టి.ఆర్ తో సుకుమార్ సినిమా అంటే అది న్యూ ట్రెండ్ ని క్రియేట్ చేస్తాడని అభిమానులు నమ్ముతున్నారు.సాధారణంగా హీరో క్యారక్టర్ ని డిఫరెంట్ గా డిసైన్ చేసే సుకుమార్ యంగ్ టైగర్ ని ఎలా చూపిస్తాడొ చూడాలి మరి. ఇక బ్యాక్ టు బ్యాక్ హిట్లతో సూపర్ ఫాంలో ఉన్న నితిన్ నెక్ష్ట్ ఇయర్ కరుణాకరణ్ దర్శకత్వంలో నటించనున్నాడు. పవన్‌ కల్యాణ్‌ ఫ్యాన్ అయిన నితిన్ పవర్ స్టార్ తొలి ప్రేమ ను డైరెక్ట్ చేసిన డైరక్టర్ తో పనిచేయనున్నాడు. ఇంకో విశేషమేంటంటే ఈ సినిమా తొలిప్రేమ కి సీక్వెల్ గా తీస్తున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్‌. పవర్ స్టార్ ని సూపర్ లవర్ బోయ్ లా చూపించిన కరుణాకరణ్ నితిన్ ని ఎలా చూపించనున్నాడో అని ఆడియెన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం నితిన్ కొరియర్ బోయ్ కళ్యాన్ , హార్ట్ ఎటాక్ సినిమాలు చేస్తున్నాడు. రైటర్లు డైరక్టర్లు కావడం కొత్తేమీ కాదు ఆ కోవలోనే బలుపు సినిమాకి కథ ను అందించిన బాబీ మాస్‌ మహారాజా రవితేజ్ తో ఓ సినిమా తీస్తున్నాడు. ఈ సినిమా తో నే డైరక్టర్ గా పరిచయమవుతున్న బాబీ ఈ సినిమా రవితేజ్ కెరియర్ లో మరో విక్రమార్కుడు అవుతుందని చెబుతున్నాడు. హన్సిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు జింతాత..జిత..జిత అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. స్వామిరా రా సినిమాతో సూపర్ హిట్ కొట్టిన డైరక్టర్ సుధీర్ వర్మ .. మొదటి సినిమాతోనే ఇండస్ట్రీని తనవైపుకు తిప్పుకున్న ఈ డైరక్టర్ తన నెక్ష్ట్ ఫిల్మ్ ని కింగ్ నాగార్జున తో కమిట్ అవుతున్నాడు. టాలెంటెడ్ టెక్నిషియన్స్ కి అవకాశం ఇవ్వడంలో ముందుండే నాగ్ మరో సారి సుధీర్ కి అవకాశం ఇచ్చాడు. డిఫరెంట్ మూవీగా రాబోతున్న ఈ సినిమాతో సూపర్ కాంబినేషన్ ఏర్పడబోతుందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: