విక్టరీ` వెంకటేష్, అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య కలిసి నటించిన చిత్రం `వెంకీ మామ`. బాబి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఇటీవలె ప్రేక్షకుల ముందకు వచ్చింది. ఫ్యామిలీ ఎంటర్‌టైన‌ర్‌గా పాజిటివ్ టాక్ దక్కించుకుని భారీ వసూళ్లు సాధిస్తోంది.  జై జవాన్..జై కిసాన్ నేపథ్యంలో తెరకెక్కిన‌ ఈ సినిమాలో వెంకటేష్ రైతు పాత్రలో నటిస్తే.. నాగ చైతన్య సైనికుడి పాత్రలో నటిస్తున్నాడు. 33 ఏళ్లుగా తెలుగు ఇండ‌స్ట్రీలో తిరుగులేని ప్ర‌యాణం సాగిస్తున్న సంచ‌ల‌న హీరో వెంక‌టేష్.  తెలుగులో ప్రస్తుతం వెంకటేష్.. మల్టీస్టారర్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచాడు. 

 

సీనియ‌ర్ అయినా జూనియర్ల‌తో అయినా చాలా కూల్ మింగిల్ అయిపోతుంటారు. ఇప్ప‌టికే  కుర్ర హీరోలతో మల్టీస్టారర్ సినిమాలు వరుస పెట్టి చేస్తున్నాడు. అయితే ఆయ‌న ఏజ్ గ్రూప్ హీరోలతో కాకుండా.. యంగ్ హీరోలతో చేస్తున్నాను వెంకీ. ఇప్ప‌టికే రామ్‌తో మాసాలా, మహేష్ బాబు తో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, పవన్ కళ్యాణ్ తో గోపాల గోపాల, వరుణ్ తేజ్ ఎఫ్ 2.. ఇక తాజాగా నాగ‌చైత‌న్య‌తో వెంకీ మామ ఇలా వ‌ర‌స పెట్టి మ‌ల్టీస్టార‌ర్ సినిమాలు చేస్తున్నాడు. ఈ క్ర‌మంలోనే వెంక‌టేష్‌.. తాజాగా జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్‌లతో మల్టీస్టారర్ చేయాలని ఉంది.

 

నానితో ఇదివరకు ఒక స్టోరీ అనుకున్నా.. వర్కౌట్ కాలేదు. భవిష్యత్తులో చేస్తానేమో చెప్పలేనని వెంక‌టేష్‌ చెప్పుకొచ్చారు. ఇక ఎన్టీఆర్ గతంలో వెంకటేష్ నటించిన చింతకాయల రవి సినిమా లో ఓ పాటలో డ్యాన్స్ చేశాడు. మ‌ళ్లీ ఇప్పుడు మంచి క‌థ, ద‌ర్శ‌కుడు దొరికితే సురేష్‌బాబు నిర్మాతలో సినిమా చేయ‌డానికి వెంక‌టేష్‌, ఎన్టీఆర్ ఆస‌క్తిగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఎన్టీఆర్.. ప్రముఖ సినీ దర్శకుడు ఎస్‌ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో న‌టిస్తున్నాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తూ ఉండగా జూనియర్ ఎన్టీయార్ కొమరం భీం పాత్రలో నటిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: