బిగ్ బాస్ 13 వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ అర్హాన్ ఖాన్ బిగ్ బాస్ షో కు ముందే పెళ్లి అయినట్లు షో హోస్ట్ సల్మాన్ ఖాన్ ప్రకటించారు. ఇక ఈ షోలో రష్మి దేశాయ్ తో ప్రేమాయణం నడిపిన అర్హాన్ సల్మాన్ ప్రకటనతో గుట్టురట్టు అవడంతో బిక్కమొహం వేసాడు. షోలో పాల్గొన్న రష్మీ దేశాయ్ ఈ హీరోతో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయింది. సల్మాన్ ప్రకటనతో తను మోసపోయానని గ్రహించిన రష్మీ దేశాయ్ అర్హాన్ పై పోలీసులకు పిర్యాదు చేసింది.

 

"నేను అర్హాన్‌ను ఒక పార్టీలో కలిశాను, 2006 లో ఒక స్నేహితుడు ద్వారా అర్హాన్ నాకు పరిచయమయ్యాడు. పార్టీలో నన్ను చూసినప్పటి నుండి అతను నా వెంట పడ్డాడు. ఆ తరువాత మేము ఒకరినొకరం ఇష్టపడ్డాం. ఆరు నుండి ఏడు రోజుల తరువాత అతను తన సామాను మరియు అన్నిటితో నా ఇంటికి వచ్చాడు. తనకి ఇంట్లో ఏదో సమస్య ఉందని, అతని వద్ద డబ్బు లేదని నాకు చెప్పాడు, తనకు సహాయం చేయాల్సిందిగా కోరాడు. ఆ సమయంలో నేను లోఖండ్‌వాలాలో ఉంటున్నాను. ఆ సమయంలో ఆ ఫ్లాట్ లో ఉండేదుకు మా దగ్గర సరిపడా డబ్బు లేనందున వేరే ఫ్లాట్ కి మారాం. ఆ తరువాత నుంచి మేము ఇద్దరం ఐదు సంవత్సరాల పాటు సహజీవనం చేసాం." అంటూ రష్మీ దేశాయ్ తెలిపింది.

 

"ఐదు సంవత్సరాల తరువాత అతను ఈ మధ్య ఒక సంవత్సరం అదృశ్యమయ్యాడు. ఎప్పుడు తిరిగి వస్తావని నేను అతనిని అడిగేదానిని, వ్యాపారంలో కొంత డబ్బు సంపాదిస్తానని అతను నాకు చెప్పేవాడు, ఇలా చెప్తూ అతను ఒక సంవత్సరం పూర్తిగా అదృశ్యమయ్యాడు, కొద్ది రోజుల తరువాత ఒక రోజు అతను నన్ను పిలిచి, నేను పెళ్లి చేసుకున్నానని చెప్పాడు నేను గట్టిగా అడగడంతో హాస్యమాడుతున్నానని చెప్పి పెళ్లి అవ్వలేదని చెప్పాడు" అని రష్మీ దేశాయ్ పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: