నీడ సినిమాతో టాలీవుడ్ కి బాలనటుడిగా, తండ్రి సూపర్ స్టార్ కృష్ణ గారి నట వారసత్వంతో అడుగు పెట్టిన మహేష్ బాబు, చిన్నప్పుడే తన ఆకట్టుకునే నటనతో ప్రేక్షకులను అలరించారు. ఇక ఆ తరువాత పెరిగి పెద్దయ్యాక రాజకుమారుడు అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన మహేష్ ను చూసిన సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అంతేకాదు తొలి చిత్రంతోనే అత్యద్భుత విజయాన్నిఆ అందుకున్న అతి తక్కువమంది టాలీవుడ్ హీరోల్లో మహేష్ కూడా ఒకరు. ఇక ఆ తరువాత నాలుగవ సినిమా మురారితో తన బాక్సాఫీస్ స్టామినాని రుచి చూపించిన మహేష్ బాబు, తన కెరీర్ ఏడవ సినిమాగా వచ్చిన ఒక్కడుతో అతి పెద్ద స్టార్డం ని సంపాదించారు. 

 

అప్పట్లో ఆ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. ఆ తరువాత కొన్నాళ్ళకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఆయన నటించిన అతడు, వెంటనే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన పోకిరి సినిమాలతో రెండు వరుస సూపర్ హిట్స్ కొట్టారు మహేష్. కాగా పోకిరి అప్పట్లో అతిపెద్ద ఇండస్ట్రీ హిట్ ని సొంతం చేసుకుని మహేష్ కు సూపర్ స్టార్డంని తీసుకువచ్చింది. అనంతరం కొన్నాళ్ళకు శ్రీను వైట్ల దర్శకత్వంలో మహేష్ నటించిన దూకుడు, దాని తరువాత పూరి దర్శకత్వంలో వచ్చిన బిజినెస్ మ్యాన్, మరియు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలు మహేష్ బాబుకు మూడు వరుస విజయాలు అందించాయి. ఆపై కొన్నాళ్ల తరువాత కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ నటించిన శ్రీమంతుడు, మరొక్కసారి ఆయన దర్శకత్వంలోనే నటించిన భరత్ అనే నేను, 

 

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన మహర్షి సినిమాలతో సూపర్ డూపర్ హిట్స్ అందుకున్నారు మహేష్. అయితే ఆయన కెరీర్ లో కొన్ని పరాజయాలు కూడా ఉన్నప్పటికీ, ఎప్పటికప్పుడు వాటిని తట్టుకుని ధైర్యంగా ముందుకు సాగారు సూపర్ స్టార్. వాస్తవానికి మహేష్ బాబుకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్, చరిష్మా, మార్కెట్ అనన్య సామాన్యమైనవి అనే చెప్పాలి. ఎవరెన్ని అన్నా కానీ, టాలీవుడ్ నటుల్లో సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఎదురే లేదు అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. ప్రస్తుతం మహేష్ నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమా, జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది......!!

మరింత సమాచారం తెలుసుకోండి: