తండ్రి నటశేఖర సూపర్ స్టార్ కృష్ణ గారి నుండి అద్భుతమైన నటనతో పాటు అందాన్ని కూడా పుణికిపుచ్చుకున్న నేటి తరం సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రస్తుతం టాలీవుడ్ గర్వించదగ్గ అగ్ర నటుల్లో ఒకరుగా కొనసాగుతున్నారు. నిజానికి గొప్ప అందగాడైన మహేష్ బాబు గ్లామర్ గురించి ఎంత చెప్పినా తక్కువే అనాలి. టాలీవుడ్ హీరోల్లో కేవలం మహేష్ కు మాత్రమే ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, ఇప్పటివరకు ఒక్క ఇతర భాషా సినిమాలో కూడా నటీంచనప్పటికీ కూడా, హిందీ సహా పలు ఇతర భాషల్లో ఏకంగా చాలా మంది బడా హీరోయిన్స్ ఆయనకు అభిమానులుగా ఉండడం. కెరీర్ మొదట్లో కొంత రిజర్వుడుగా వ్యవహరించిన మహేష్ బాబు, మెల్లగా మంచి హిట్స్ అందుకున్న తరువాత, 

 

అభిమానులకు చేరువ అవడం మొదలెట్టారు. ఇక 2010లో నమ్రత శిరోద్కర్ తో వివాహం అనంతరం మహేష్ బాబు సినీ మరియు వ్యక్తిగత జీవితంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ఇక వివాహం అనంతరం పిల్లలు పుట్టిన తరువాత మహేష్ ఎక్కువగా తన తీరిక సమయాన్ని కుటుంబ సభ్యుల కోసం కేటాయిస్తున్నారు. ఆయన కొడుకు గౌతమ్, కూతురు సితార ఇద్దరూ కూడా మన తెలుగు ప్రేక్షకులకు ఎంతో సుపరిచితం. వన్ నేనొక్కడినే సినిమాలో మహేష్ చిన్నప్పటి క్యారెక్టర్ లో గౌతమ్ నటించగా, ఇటీవల హాలీవుడ్ మూవీ ఫ్రోజెన్ 2లో చిన్ననాటి పాత్రకు ఎల్సాకు తన వాయిస్ ని అందించింది సితార. అంతేకాక దర్శకుడు వంశీ పైడిపల్లి కూతురైన ఆద్యతో కలిసి ఒక యూట్యూబ్ ఛానల్ ని ప్రారంభించి ప్రస్తుతం పలు ఆసక్తికర వీడియోలు పోస్ట్ చేస్తోంది. ఒక మంచి భర్తగా, 

 

మరియు తమ బిడ్డలకు తండ్రిగా మహేష్ బాబుకు 10 కి 10 మార్కులు వేస్తానని అంటారు నమ్రత. కొన్నేళ్ల క్రితం తన తల్లితండ్రుల మరణం సమయంలో భర్త మహేష్ బాబు తనకు తోడు, నీడగా ఉండి, అందించిన ధైర్యం అంతా ఇంతా కాదని, మహేష్ బాబు ఎంత అందంగా ఉంటారో ఆయన మనసు కూడా అంతే అందంగా ఉంటుందని ఆమె పలు ఇంటర్వ్యూల్లో చెప్పడం జరిగింది. ఈ విధంగా ప్రపంచ డ్రీమ్ బాయ్ గా వెలిగొందుతున్న సూపర్ స్టార్, తన బిడ్డలకు బెస్ట్ ఫాదర్ అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు....... !!

మరింత సమాచారం తెలుసుకోండి: