సోషల్ మీడియాలో ట్రోలింగ్ కల్చర్ రోజురోజుకి పెరిగిపోతుంది. అది ఒక రాజకీయ నాయకుడి పైన లేకపోతే సినిమా హీరో అయిన పైన ట్రోలింగ్ గట్టిగా చేస్తే ఆ వార్త సదరు సెలబ్రిటీ పెద్ద హాట్ టాపిక్ అవుతున్నారు. ఇటువంటి నేపథ్యంలో తాజాగా బాలయ్య బాబు పై సోషల్ మీడియాలో ఉన్న నెటిజన్లు ట్రోలింగ్ ఇటీవల స్టార్ట్ చేశారు. అది కూడా మామూలుగా కాదు ఓ రేంజ్ లో. విషయంలోకి డీటెయిల్ గా వెళితే తమిళ డైరెక్టర్ కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో బాలయ్య బాబు ‘రూలర్’ అనే సినిమా చేస్తున్న విషయం మనకందరికీ తెలిసినదే. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుక విశాఖపట్టణం లో చాలా గ్రాండ్ గా సినిమా యూనిట్ చేయడం జరిగింది.

 

అయితే సినిమాలో బాలయ్య బాబు ఫ్రెంచ్ లుక్ లో దర్శనమివ్వడంతో క్యారెక్టర్ పరంగా ఆ లుక్ లో బాలయ్య  ఎలా ఉన్నారు? అన్నది హాట్ డిబేట్ కి తెర తీసింది. ఆ న్యూ లుక్ కోసం ఆయన ఎంతో శ్రమించాడు. ఆ లుక్ ని కూడా నెటిజనులు వదిలి పెట్ట లేదు. సోషల్ మీడియాలో జోరుగా ట్రోల్స్ చేస్తున్నారు. బాలయ్య ఆ లుక్ లో టోనీ స్టార్క్ లా ఉన్నాడని మరికొందరు విజయ్ మాల్యాలా ఉన్నాడని ఇంకా అనేక మంది పేర్లతో బాలయ్య బాబు లుక్ ని పోలుస్తున్నారు. నందమూరి అభిమానులు అయితే కన్ఫామ్ గా బాలయ్య బాబు ఈ లుక్ లో టోనీ స్టార్క్ లా ఉన్నాడని అంటున్న నేపథ్యంలో తాజాగా బాలయ్య బాబు వచ్చిన కామెంట్ల పై స్పందించడం జరిగింది.

 

'సమరసింహారెడ్డి' సమయంలో మరియు అదే విధంగా లారీ డ్రైవర్ సినిమా చేస్తున్న సమయంలో రకరకాలుగా నేను వేసిన వేషం పై కామెంట్లు చేశారు ఇప్పుడు అదే విధంగా హాలీవుడ్ హీరో తో నన్ను పోల్చి అభిమానులు తమ ప్రేమను వెల్లడి చేస్తున్నారు నన్ను నందమూరి టోనీ స్టార్క్ అని పిలుస్తున్నారు.  ఇది వారికి నా పై ఉన్న ప్రేమ.. అభిమానం అని బాలయ్య అన్నారట. దీంతో మరో సినిమా హీరోలు బాలయ్య చేసిన కామెంట్ల పై బాలయ్య నీ సెల్ఫ్ డబ్బా ఆపయ్య అంటూ సెటైర్లు వేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: