ఆనాటి కాలంలో కృష్ణ హీరోగా ఎంతటి ఘనత సాధించారు అందరికీ తెలిసిన విషయమే. ఎన్నో ఏళ్లుగా తెలుగు చిత్ర పరిశ్రమలో నెంబర్ వన్ హీరోగా కొనసాగారు సూపర్ స్టార్ కృష్ణ. ఈనాటి కాలానికి ఘట్టమనేని కృష్ణ వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు రాజకుమారుడు లాంటి మహేష్ బాబు.బాలనటుడిగానె సినిమాల్లో   నటించి తెలుగు ప్రేక్షకులను అప్పట్లోనే మెప్పించాడు మహేష్ బాబు. రాజకుమారుడు సినిమా తో టాలీవుడ్కు హీరోగా ఎంట్రీ ఇచ్చి అంచెలంచెలుగా ఎదిగారు మహేష్ బాబు. కెరియర్ మొదటి నుంచే అతి తక్కువ మాట్లాడుతూ.. ఓ సాదాసీదా మనిషి లా అందరి మనసులు దోచుకున్నాడు మహేష్ బాబు. హంగు ఆర్భాటాలకు మహేష్ మొదటి నుంచి దూరం గానే ఉన్నాడు. వరుస సినిమాలు చేసుకుంటూ తండ్రికి తగ్గ తనయుడిగా టాలీవుడ్లో తనదైన ముద్ర వేసుకున్నాడు మహేష్ బాబు. 

 

 

 

ఒకప్పుడు సూపర్ స్టార్ కృష్ణ తనయుడు మహేష్ బాబు అని అందరు అనుకొనే వారు. కానీ ఇప్పుడు మాత్రం సూపర్ స్టార్ మహేష్ బాబు వాళ్ళ నాన్న అలనాటి హీరో  కృష్ణ అని అనుకునేంత  స్థాయికి ఎదిగారు మహేష్ బాబు. అంచెలంచెలుగా ఎదుగుతూ తెలుగు ప్రేక్షకులందరికీ నేటితరం సూపర్ స్టార్ గా మారిపోయాడు మహేష్ బాబు. ఈనాటి హీరోలందరి లో మేటి  హీరోగా పేరు సంపాదించారు. ఎలాంటి  కాంట్రవర్సీ లలో లేకుండా  సినిమాలు చేసి   మచ్చలేని మచ్చలేని హీరోగా పేరు తెచ్చుకోవడం ఒక మహేష్ బాబుకే సొంతమైంది. ప్రేక్షకులందరూ ఎక్కువగా మహేష్ బాబు మాటలను సినిమాల్లో చూడడమే తప్ప.. బయట చూసింది చాలా అరుదు. ఎందుకంటే తన సినిమా ఈవెంట్లలో కూడా మహేష్ బాబు చాలా పొదుపు గానే మాట్లాడుతూ ఉంటారు. 

 

 

 

 సినిమాల్లో ఎంత పవర్ ఫుల్ డైలాగులు చెప్పిన నిజ జీవితంలో మాత్రం చాలా తక్కువగా మాట్లాడుతూ సింపుల్ గా  కనిపిస్తూ ఉంటారు మహేష్ బాబు. అందుకే మహేష్ బాబు తెలుగు ప్రేక్షకులని అమితంగా ఆకర్షించారు . ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన  పేజీలు లిఖించుకున్నాడు మహేష్ బాబు. మహేష్ బాబు నటించిన సినిమాలో బాక్సాఫీస్ ని ఒక రేంజ్ లో షేక్ చేసిన సినిమాలు ఎన్నో. సినిమాలో ఎలాంటి పాత్ర అయినా దానికి కరెక్ట్ గా సెట్ అయ్యే హీరో మహేష్ బాబు ఎందుకంటే ఆయన వయసు పెరుగుతుంది కానీ ఆయన అందం  మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. చాలా పొదుపుగా మాట్లాడుతూ ఎలాంటి కాంట్రవర్సీ లలో ఇరుక్కోకుండా సూపర్ స్టార్ గా ఎదిగిన ఒకే ఒక్క హీరో  ఘట్టమనేని వారసుడు  సూపర్ స్టార్ మహేష్ బాబు.

మరింత సమాచారం తెలుసుకోండి: