సినీ పరిశ్రమలో ఒక్కో హీరో ఒక్కో ట్రెండ్ సృష్టించారు.  ఎన్టీఆర్ నవరసాలు పండించే నటసౌర్వభౌములు.. తాగు బోతు, భగ్నప్రేమికుడిగా ఏఎన్ఆర్ మెప్పించారు.  ఆ సమయంలో హాలీవుడ్ స్థాయిలో కౌబాయ్, సీఐడీ నేపథ్యంలో ప్రేక్షకులకు కొత్తదనాన్ని అందించారు సూపర్ స్టార్ కృష్ణ.  అప్పట్లో ఫైట్స్ అంటే కృష్ణ సినిమా చూడాల్సిందే అనే పరిస్థితి ఉండేది.  ఆ తర్వాత ఎంతో మంది హీరోలో ఫైట్స్ లో దమదైన స్టైల్స్ చూపిస్తూ వచ్చారు.  సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ‘రాజకుమారుడు’ మూవీతో హీరోగా పరిచయం అయ్యారు ప్రిన్స్ మహేష్ బాబు.  మొదటి సినిమా యావరేజ్ టాక్ వచ్చింది.. తర్వాత సినిమాలు కూడా పెద్దగా జనాకర్షన పొందలేదు.  మురారి, అతడు, ఒక్కడు మూవీస్ తో మహేష్ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్నాడు. 

 

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘పోకిరి’ అప్పటి వరకు ఉన్న రికార్డులు బ్రేక్ చేసింది.  ఈ మూవీలో ఊరమాస్ లుక్ తో కనిపించిన మహేష్ తర్వాత పోలీస్ ఆఫీసర్ గా దుమ్మురేపాడు. ఆ తర్వాత మహేష్ స్థాయి ఒక్కసారే పెరిగిపోయింది.  దూకుడు సినిమాతో తనదైన కామెడీ మార్క్ చాటుకున్నారు మహేష్ బాబు.  కొరటాల దర్శకత్వంలో శ్రీమంతుడు మూవీతో మంచి మెసేజ్ అందించారు.  ఆ తర్వాత బ్రహ్మోత్సవం, స్పైడర్ మూవీస్ దారుణమైన డిజాస్టర్ అయ్యాయి.  మరోసారి కొరటాల శివ దర్శకత్వంలో ‘భరత్ అనే నేను’ మూవీతో ప్రస్తుత రాజకీయాలు ఇలా ఉంటే ఎంతో అభివృద్ది పథంలో ఉంటుందని చూపించారు. 

 

మూవీ భారీ వసూళ్లు సాధించింది.  ఈ ఏడాది వంశి పైడిపల్లి దర్శకత్వంల ‘మహర్షి’ మూవీతో రైతుల గౌరవాన్ని కాపేడే మెసేజ్ అందించారు.  ఇలా వరుసగా మెసేజ్ ఓరియెంటెడ్ మూవీస్ లో నటిస్తూ వస్తున్న మహేష్ బాబు మరోసారి తనదైన కామెడీ మార్క్ తో అలరించాలని చూస్తున్నారు.  అనీల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’ రూపొందుతుంది.  ఈ మూవీ పోస్టర్స్, టీజర్, లిరిక్స్ బాగా అలరించాయి. అయితే ఈ మూవీ మొదలు పెట్టి ఇప్పటికే చాలా ఆలస్యం అవుతుంది.. కానీ ఆయన ఫ్యాన్స్ మాత్రం మహేష్ బాబు లేటుగా వచ్చినా లేలెస్ట్ గా వస్తారు.. బాక్సాఫీస్ షేక్ చేస్తారని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: