సినిమా అంటే కమిట్‌మెంట్‌తో కూడుకున్న వ్యవహారం. సాధారణంగా చిత్రపరిశ్రమలో సినిమా చిత్రీకరణ నిమిత్తం ఇచ్చిన కమిట్‌మెంట్ విషయంలో చాలమంది నటులు నిర్మాతల్ని ఇబ్బందులకు గురిచేసిన సందర్భాలు ఉన్నాయి.. ఇక కమిట్‌మెంట్ సరిగా లేక నష్టపోయిన నిర్మాతలు కూడా ఉన్నారు.. అయితే ప్రభాస్ విషయానికి వస్తే బాహుబలి చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నాడు.

 

 

అదీ గాకుండా ఈ సినిమా కోసం ఏకంగా 5 సంవత్సరాలు స్పెండ్ చేసాడు. మరో సినిమాకి ఓకే చెయ్యకుండా తన ఎఫర్ట్ మొత్తం బాహుబలి పైనే పెట్టాడు అందుకే అంతటి విజయాన్ని అందుకోగలిగాడు. ఒక హీరో అన్ని సంవత్సరాలు ఒకే సినిమాకు తన టైం ను కెటాయించడం నిజంగా చాలా అరుదుగా జరిగే విషయం. ఇప్పుడు ప్రభాస్‌ను చూసిన ప్రతి వ్యక్తి కమిట్‌మెంట్ అంటే ప్రభాస్.. ప్రభాస్ అంటే కమిట్‌మెంట్ అని పొగడకుండా ఉండలేరు..

 

 

ఎందుకంటే  తన జీవితంలో చాలా విలువైన ఐదు సంవత్సరాల కాలాన్ని ఒక్క బాహుబలి తోనే గడిపేశాడు. కానీ ఎన్ని సినిమాలు చేసిన రాని క్రేజ్ ఒక్క బాహుబలి తోనే సంపాదించుకున్నాడు . ఈ ఒక్క సినిమాతోనే యంగ్ రెబల్ స్టార్ ప్రపంచం మొత్తం అభిమానులని పొందాడు. దీనితో బాహుబలి తరువాత ఆయనతో సినిమాలు చేయటానికి బాలీవుడ్ తోపాటుగా, హాలీవుడ్ కూడా పోటీ పడింది . కానీ అయన ఒక అప్ కమింగ్ డైరెక్టర్ అయిన సుజిత్ తో సినిమా చేసాడు.  

 

 

సినిమా కూడా భారీ బడ్జెట్ తో రూపొందింది. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే రాజమౌళి లాంటి పెద్ద డైరెక్టర్ తో సినిమా అంటే ఏళ్ల తరబడి వెయిట్ చేసిన ఒకే, అది ఎలాగూ తన కెరియర్ కి ప్లస్ అవుతుంది, కానీ ఇలా చిన్న చిన్న డైరెక్టర్స్ తో సినిమాలు చేసేటప్పుడు టైం మెయింటైన్ చేయడం చాలా అవసరం. ఒకేవేళ ఆ సినిమా కానీ కొంచెం తేడా కొట్టిన మొత్తం తన స్టార్ డమ్ పై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. కాని ఇవేవి ఆలోచించకుండా.. తాను ఇచ్చిన మాటకు కట్టుబడి సాహో చిత్రాన్ని పూర్తిచేశాడు... ఇది ప్రభాస్ అంటే అని నిరూపించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: