నందమూరి నట వారసుడిగా బాల నటుడిగానే తన సత్తా చాటి టాలీవుడ్ హీరోగా ఎంట్రీ ఇచ్చి అంచలంచెలుగా ఎదిగిన హీరో జూనియర్ ఎన్టీఆర్. తాతకు తగ్గ మనవడిగా.. నందమూరి అసలు సిసలైన వారసునిగా జూనియర్ ఎన్టీఆర్ తెలుగు ప్రజల్లో పేరొందాడు. అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోగా కొనసాగుతున్నారు జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ సినిమా వస్తుందంటే అభిమానుల్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. కథ ఎలాంటిదైనా పాత్ర ఎలాంటిది అయినా తన విలక్షణమైన నటనతో సినిమా చూస్తున్న ప్రేక్షకులందరినీ కట్టిపడేసే గల సత్తా జూనియర్ ఎన్టీఆర్ సొంతం. అందుకే జూనియర్ ఎన్టీఆర్ సినిమా వస్తుందంటే అది తప్పక విజయం సాధించాల్సిందే. ఒకవేళ ఏదైనా చిన్న కారణాల ద్వారా సినిమా ఫ్లాప్ అయినప్పటికీ... ఆ సినిమాకు మినిమం వసూళ్లు మాత్రం గ్యారంటీ. అందుకే జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేసేందుకు దర్శక నిర్మాతలందరూ క్యూ కడుతుంటారు.. 

 

 

 జూనియర్ ఎన్టీఆర్ వరుస విజయాలతో దూసుకుపోతూ తనదైన నటనతో తెలుగు ప్రేక్షకుల అందరిని మంత్రముగ్దుల్ని చేస్తూ దూసుకుపోతున్నాడు. జై లవకుశ సినిమాలో ఏకంగా త్రిపాత్రాభినయం చేసిన జూనియర్ ఎన్టీఆర్.. మూడు పాత్రల్లో  అదిరిపోయే నటనతో అందరిని ఆకర్షించాడు. ఇక జనతా గ్యారేజ్ లో ప్రకృతిని కాపాడితే యువకుడిగా ఎన్నో సాహసాలు చేస్తూ.. నేచర్ విలువ ఏంటో సమాజానికి తెలియజెప్పి భారీ విజయాన్ని అందుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఇక అరవింద సమేత సినిమాలో.. మనిషి ప్రాణం విలువను అందరికీ తెలియజెప్పుతూ .. ప్రాణం తీయడం గొప్ప కాదు ప్రాణాన్ని నిలబెట్టడం గొప్ప అని చాటి చెప్పి... నట విశ్వరూపం తో తెలుగు ప్రేక్షకుల అందరినీ మంత్రముగ్ధులను చేశారు. ఇలా విభిన్నమైన కథలను ఎంచుకుంటూ వరుస విజయాలను సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్నాడు జూనియర్ ఎన్టీఆర్. 

 

 

 దీంతో దర్శక నిర్మాతలందరూ ఎన్టీఆర్ తో సినిమా చేసేందుకు క్యూ కడుతున్నారు. ఎందుకంటే ఎన్టీఆర్ తో సినిమా అంటే భారీ వసూళ్లు ఖాయం... ఇక దర్శకుల అందరికీ జూనియర్ ఎన్టీఆర్ మేలిమి బంగారంగా మారిపోయాడు. ఎందుకంటే దర్శకుడు ఎవరైనా నిర్మాత ఎవరైనా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైనా జూనియర్ ఎన్టీఆర్ వన్ మాన్ షో గా  సినిమాను ముందుకు తీసుకెళ్ళి తన అద్భుతమైన నటనతో అందరిని మెప్పించి సినిమా విజయం వైపుగా నడిపించగల సత్తా ఉన్న హీరో. అందుకే నిర్మాతలు ఎన్టీఆర్ తో సినిమా చేస్తే కాసుల వర్షం కురవడం ఖాయం అని భావిస్తూ ఉంటే.. జూనియర్ ఎన్టీఆర్ తో సినిమాలు తెరకెక్కిస్తే తమ పేరు మార్మోగిపోతోంది అని భావిస్తుంటారు దర్శకులు. అందుకే ఎన్టీఆర్ తో సినిమా తీయడానికి ముందుకు వస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: