నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా రూపొందిన తాజా చిత్రం రూలర్. ఎన్టీఆర్‌ బయోపిక్‌గా తెరకెక్కిన కథానాయకుడు, మహానాయకుడు సినిమాలు దారుణంగా ఫెయిల్‌ కావటంతో బాలయ్య అభిమానులు ఈ సినిమా మీదే ఆశలన్ని పెట్టుకున్నారు. గతంలో బాలయ్య హీరోగా జైసింహా సినిమాకు దర్శకత్వం వహించిన కేయస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని సీ కళ్యాణ్‌ నిర్మిస్తున్నాడు. అయితే జై సింహా హిట్ టాక్ తెచ్చుకున్న నేపథ్యంలో మరోసారి రిపీటవుతున్న బాలయ్య-రవికుమార్ కాంబినేషన్ మీద జనాలు బాగానే ఆసక్తిని చూపిస్తున్నారు.

 

ఇక మన బాలయ్య రెండు డిఫరెంట్‌ లుక్స్‌లో నటిస్తున్న ఈ సినిమాలో సోనాల్‌ చౌహాన్‌, వేదికలు హీరోయిన్లుగా నటిస్తుండగా జయసుధ, భూమిక, ప్రకాష్ రాజ్‌, శియాజీ షిండేలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికేట్‌ను జారీ చేశారు. డిసెంబర్‌ 20న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

అయితే నందమూరి అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్న ఈ సినిమాకు టాక్‌ ఆశించిన స్థాయిలో లేదని తాజా సమాచారం ద్వారా తెలుస్తోంది. ముఖ్యంగా సినిమా రొటీన్‌ బాలకృష్ణ సినిమాలా ఏ మాత్రం కొత్తదనం లేకుండా సాగుతుందట. యాక్షన్‌, పంచ్‌ డైలాగ్‌లు, హీరోయిన్లతో రొమాన్స్‌ లాంటి అంశాలు అన్నీ గతంలో బాలయ్య సినిమాల్లో చాలా సార్లు చూసినట్టుగానే ఉన్నాయన్న ప్రచారం కూడా జరుగుతోంది. దీంతో రూలర్‌ బాలయ్య ఫ్యాన్స్‌కు మాత్రమే అంటున్నారు విశ్లేషకులు. అంతేకాదు ఏమాత్రం తేడా కొట్టిన బాలయ్య ఫ్యాన్స్ కూడా నిరాశపడక తప్పదట.

 

ఇక మరోపక్క బాలయ్య లుక్‌ విషయంలో కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పోలీస్ గెటప్‌లో బాలయ్య విగ్‌పై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ నడుస్తోంది. మరో లుక్‌ కూడా ఐరన్‌ మ్యాన్‌లా ఉందంటున్నారు ప్రేక్షకులు. ఇలా అన్ని రకాలుగా నెగెటివ్‌ టాక్‌ వస్తుండటం ఫ్యాన్స్‌ను కలవరపెడుతోంది. ఎన్టీఆర్ బయోపిక్‌ షాక్‌ నుంచి ఇంకా తేరుకోని ఫ్యాన్స్‌ రూలర్‌ సక్సెస్‌ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. మరి సినిమాలో ఆసక్తికరమైన కంటెంట్ లేకపోవడంతో పాత కథే కావడం తో కొత్త జాడీలో పాత పచ్చడి అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: