టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా గత ఏడాది కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన భరత్ అనే నేను సినిమా అత్యద్భుత విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. మహేష్ బాబు ముఖ్యమంత్రిగా నటించిన ఆ సినిమాపై సర్వత్రా ప్రశంశలు కురిసాయి. ఇక దాని తరువాత మహేష్ కెరీర్ 25వ సినిమాగా యువ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన మహర్షి సినిమా ఈ ఏడాది వేసవి కానుకగా మే లో రిలీజ్ అయింది. కాలేజీ విద్యార్థిగా, కంపెనీ సీఈవో గా, 

 

రైతుల సమస్యల కోసం పోరాడే వ్యక్తిగా మహేష్ బాబు ఈ సినిమాలో మూడు రకాల షేడ్స్ ఉన్న రిషి అనే పాత్రలో నటించడం జరిగింది. మహేష్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థలైన వైజయంతి మూవీస్, పివిపి సినిమా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థలు ఎంతో భారీగా నిర్మించాయి. ఇద్దరు స్నేహితుల మధ్య సాగె హృద్యమైన కథతో పాటు రైతుల సమస్యను మిళితం చేసి దర్శకుడు వంశీ తెరకెక్కించిన ఈ సినిమాను ప్రజలు విశేషంగా ఆదరించారు. 

 

రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాకు, కెయు మోహనన్ ఫొటోగ్రఫీని అందించారు. ఆకట్టుకునే కథ, కథనాలతో పాటు అలరించే సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విజువల్స్, యాక్షన్ సీన్స్, ఫైట్స్ కలబోతగా మంచి మెసేజి తో కూడిన ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు ఓవర్ ఆల్ గా రూ.150 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ లభించింది. అలానే దాదాపుగా రూ.100 కోట్ల షేర్ ని రాబట్టిన ఈ సినిమా, ఈ ఏడాది ఇప్పటివరకు రిలీజ్ అయిన తెలుగు సినిమాల్లో అత్యధిక కలెక్షన్ అందుకున్న సినిమాగా ప్రముఖ స్థానాన్ని సంపాదించింది కాగా ప్రస్తుతం మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు అనే సినిమాలో హీరోగా నటిస్తున్నారు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: