టాలీవుడ్ యువరత్న నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రస్తుతం కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'రూలర్' సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. వేదిక, సోనాల్ చౌహన్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాలో భూమిక చావ్లా, సీనియర్ నటి జయసుధ ముఖ్య పాత్రల్లో నటించడం జరిగింది. చిరంతన్ భట్ సంగీత సారథ్యంలో స్వరపరచబడిన సాంగ్స్ ఇప్పటికే యూట్యూబ్ లో రిలీజ్ అయి శ్రోతలను విశేషంగా ఆకట్టుకున్నాయి. అలానే ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ తరువాత సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఈ ఏడాది ప్రథమార్ధంలో బాలకృష్ణ హీరోగా వచ్చిన ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలైన ఎన్టీఆర్ కథానాయకుడు, 

 

మహానాయకుడు సినిమాలు రెండూ కూడా ఘోర పరాజయాన్ని అందుకున్నాయి. కావున గత ఏడాది తనతో జైసింహా వంటి మంచి సినిమాను అందించిన కేఎస్ రవికుమార్ కు రూలర్ ద్వారా మరొకసారి దర్శకుడిగా అవకాశాన్ని అందించారు బాలకృష్ణ. ఇక ఈ సినిమాను దర్శకుడు రవికుమార్ ఎంతో అద్భుతంగా తెరకెక్కించినట్లు టాక్. కాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు నిన్న జరిగాయి. యు/ఏ సర్టిఫికెట్ పొందిన ఈ సినిమాపై సెన్సార్ సభ్యులు పాజిటివ్ స్పందనను అందించినట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. ఈ సినిమాలో బాలకృష్ణ డాన్ గా, పోలీస్ ఆఫిసర్ గా, అలానే రైతుగా మూడు రకాల విభిన్న షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నట్లు చెప్తున్నారు. సినిమా ప్రథమార్ధం మొత్తం మంచి ఎంటర్టైన్మెంట్ తో సాగుతుందని, ఇక ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్ట్ సినిమాపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచుతుందని అంటున్నారు. 

 

ఇక ఒకింత మెల్లగా ఆరంభమయ్యే సెకండ్ హాఫ్, కాసేపటి తరువాత పుంజుకుంటుందని, అలానే ప్రీ క్లైమాక్స్ మరియు క్లైమాక్స్ సీన్స్ సినిమాకు ప్రధాన బలంగా చెప్తున్నారు. ఆకట్టుకునే విజువల్స్, సాంగ్స్, ఫైట్స్, యాక్షన్ సీన్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పాటు మూడు పాత్రల్లో బాలయ్య అద్భుతమైన నటన సినిమాకు ప్రధాన ఆకర్షణ అట. ఓవర్ ఆల్ గా ఒక మంచి సక్సెస్ఫుల్ సినిమాకు ఉండవలసిన అన్ని అంశాలు ఈ సినిమాలో ఉన్నాయట. సెన్సార్ నుండి సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో నందమూరి ఫ్యాన్స్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి రేపు ప్రేక్షకుల ముందుకు రాబోయే ఈ సినిమా ఎంత మేర సక్సెస్ ని అందుకుంటుందో చూడాలి......!!

మరింత సమాచారం తెలుసుకోండి: