మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ప్రస్తుతం బన్నీతో "అల వైకుంఠపురములో" సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన విడుదలకి సిద్ధం అవుతోంది. అయితే అటు దర్శకుడిగా కొనసాగుతున్న త్రివిక్రమ్ నిర్మాణ రంగంలోకి కూడా రావాలనుకున్నాడు. సాధారణంగా సక్సెస్ ఫుల్ దర్శకులు నిర్మాణ సంస్థని స్థాపించి, దాని ద్వారా తమకు నచ్చిన కథలని కొత్త దర్శకుల ద్వారా చెప్పిస్తుంటారు.

 

 

ప్రస్తుతం తెలుగులో సుకుమార్ అలాగే చేస్తున్నాడు. కొన్ని సినిమాలకి ఆయనే కథ అందించి, నిర్మాణ బాధ్యతలని కూడా చూసుకుంటున్నాడు. త్రివిక్రమ్ కి కూడా అలాంటి ఆలోచనే ఉండేది. పవన్‌కళ్యాణ్‌తో కలిసి నిర్మాణ రంగంలోకి దిగాలనుకున్నాడు. నితిన్‌తో 'ఛల్‌ మోహన్‌ రంగ' చిత్రానికి నిర్మాతగా పేరు వేసారు కానీ త్రివిక్రమ్‌ దాంట్లో ఇన్వెస్ట్‌ చేయలేదట. అయితే ఆ తర్వాత నిర్మాణం మీద దృష్టి పెట్టడానికి పవన్ రీ ఎంట్రీని ఎంచుకున్నాడట.

 

 

పవన్ రీ ఎంట్రీ ఇస్తున్న పింక్ సినిమాకి దిల్ రాజు తో కలిసి నిర్మాణంలో భాగస్వామ్యం తీసుకోవాలని అనుకున్నాడట. కానీ దిల్ రాజు, దర్శకత్వం కూడా త్రివిక్రమ్ చేస్తే నిర్మాణంలో భాగస్వామ్యం ఇస్తానని అన్నాడట. దాంతో త్రివిక్రమ్ తనకి రీమేక్ తీసే ఉద్దేశ్యం లేదని తప్పుకున్నాడట. కనీసం డైలాగులైనా రాస్తాడని అనుకుంటే, త్రివిక్రమ్ కి ఇచ్చే బడ్జెట్ ఎక్కువ కాబట్టి ఆ రిస్క్ దిల్ రాజు తిసుకోలేడట. 

 

ఇక ప్రస్తుతం త్రివిక్రమ్ సినీ నిర్మాణ రంగానికి స్వస్తి పలికినట్లే. మళ్ళీ దీనిపై త్రివిక్రమ్ ఎప్పుడు స్పందించి సినిమాలు నిర్మిస్తాడో చూడాలి. అల వైకుంఠపురములో తర్వాత త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో సినిమా చేస్తాడని అంటున్నారు. ఈ విషయంపై అధికారిక ప్రకటన అయితే రాలేదు.  ప్రస్తుతానికి త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అల వైకుంఠపురములో సంక్రాంతి కానుకగా విడుదల అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: