టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో నితిన్ కెరియర్ మంచి జోష్ లో ఉండగా ప్రస్తుతం నితిన్ వరుసగా మూడు సినిమాలు చేస్తున్నాడు. ఇక టాలీవుడ్ మోస్ట్ ఐజిబుల్ బ్యాచిలర్ అయిన నితిన్ పెళ్లిపై కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. అప్పట్లో ఓ తమిళ హీరోయిన్ తో నితిన్ లవ్ అంటూ వార్తలు వచ్చాయి. ఆమెతోనే నితిన్ పెళ్లి అంటూ హడావిడి చేశారు. అయితే ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం ప్రకారం నితిన్ పెళ్లి ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది.

 

హైదరాబాద్ కు చెందిన ఒక డాక్టర్ ను నితిన్ పెళ్లి చేసుకుంటాడని తెలుస్తుంది. నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి నితిన్ పెళ్లి ఏర్పాట్లలో బిజీగా ఉన్నారట. 2020 ఏప్రిల్ 15న నితిన్ మ్యారేజ్ డేట్ అని అంటున్నారు. అయితే ఎక్కువ హడావిడి లేకుండా కేవలం కుటుంబ సభ్యుల వరకే ఈ పెళ్లికి వచ్చేలా ప్లాన్ చేశారట. మ్యారేజ్ కూడా దుబాయ్ లో జరుపుతారని తెలుస్తుంది.

 

దుబాయ్ లో మ్యారేజ్ జరిగినా రిసెప్షన్ మాత్రం హైదరాబాద్ లో గ్రాండ్ గా ఏర్పాటు చేస్తారని తెలుస్తుంది. ఇక నితిన్ కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం వెంకీ కుడుముల డైరక్షన్ లో భీష్మ సినిమా చేస్తున్నాడు నితిన్. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఈమధ్యనే ఈ సినిమా నుండి వచ్చిన టీజర్ ప్రేక్షకులను అలరించింది. 

 

భీష్మ తర్వాత నితిన్ వెంకీ అట్లూరి డైరక్షన్ లో రంగ్ దే సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇవి రెండే కాదు చంద్రశేఖర్ యేలేటి డైరక్షన్ లో చదరంగం సినిమా సెట్స్ మీదకు వెళ్లాల్సి ఉంది. మొత్తానికి 2020 సినిమాలతోనే కాదు ఓ ఇంటివాడై నితిన్ కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నాడని తెలుస్తుంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: