ఈటీవీ ప్లస్ లో ప్రసారమయ్యే పటాస్ షో ప్రేక్షకులను ఎంతగా అలరిస్తుందో అందరికీ తెలిసిన విషయమే. ఈ షో  మొదలైనప్పటి నుంచి పటాస్ షో ని ఒక రేంజ్ లో పాపులర్ చేసింది యాంకర్ రవి శ్రీముఖి అని చెప్పాలి. ఈ  ఇద్దరి కెమిస్ట్రీ బాగా కుదిరడంతో   పటాస్ షో కి ఒక్కసారిగా క్రేజ్ వచ్చేసింది. ఇక పటాస్ లో చేసే స్టాండప్ కామెడీ ద్వారా కూడా పటాస్ క్రేజ్ ఎక్కడికొ  వెళ్ళిపోయింది. అయితే పటాస్ షో టాప్ రేటింగ్  తో దూసుకు పోతున్న తరుణంలో శ్రీముఖి బిగ్ బాస్ వెళ్లాలనుకునీ  పటాస్ షో కి గుడ్ బై చెప్పేసింది. ఇక బిగ్ బాస్ లో కూడా తనదైన స్టైల్ లో రచ్చ చేసి కొద్దిలో బిగ్ బాస్ టైటిల్ మిస్సయింది శ్రీముఖి. శ్రీముఖి బయటకు వచ్చిన తర్వాత పటాస్ షో మళ్ళీ చేస్తుందని అందరూ అనుకున్నారు కానీ శ్రీముఖి మాత్రం పటాస్ జోలికి పోలేదు. 

 


 ఇకపోతే శ్రీముఖి పటాస్ నుంచి వెళ్లిపోయిన తర్వాత శ్రీముఖి ప్లేస్ వర్షిని తీసుకొచ్చారు. అయితే వర్షిని గ్లామర్ పరంగా ఓకే అయినప్పటికీ యాంకరింగ్  పరంగా మాత్రం శ్రీముఖినీ  తలపించు లేకపోయింది. అయితే మొదట్లో తడబడిన ఆ తర్వాత మాత్రం కాస్త పుంజుకుంది వర్షిని. అయితే శ్రీముఖి రేంజ్ లో మాత్రం పటాస్ షో లో గోల  గోల  చేయలేకపోయింది వర్షిని. చిన్న చిన్న పంచ్ లు  వేసుకుంటూ పటాస్  అలా అలా కొనసాగుతూ వచ్చింది. అయితే రవి వర్షిని కాంబినేషన్ కాస్త అభిమానులు అలవాటు పడుతున్నారు అనుకున్న సమయంలో యాంకర్ రవి పటాస్ షో ని వదిలి వెళ్లిపోయాడు. దీంతో వర్షిని లో మరింత ఒత్తిడి వచ్చినట్లు కనిపిస్తోంది. అయితే యాంకర్ రవి ప్లేస్ లో చలాకి చంటి వచ్చాడు. ఇక చలాకి చంటి ఎనర్జీ కూడా ఎక్కడ తగ్గకుండా ఉంటుంది. 

 


 అయితే చలాకి చంటి తో ఎనర్జి  మ్యాచ్ చేయాలంటే శ్రీముఖి ఉంటే బాగుండేది అని ప్రస్తుతం ప్రేక్షకులు అనుకుంటున్న మాట. హైపర్ రేంజిలో యాంకర్ చంటి ఎనర్జీ ఉంటే.. వర్షిని చంటి ఎనర్జీ  మ్యాచ్ చేయలేకపోతుంది అని పటాస్ ప్రేక్షకులు భావిస్తున్నారు. యాంకర్ వర్షిని కూడా శ్రీముఖి రేంజ్ లో పటాస్ షో లో గోల గోల చేసి చలాకి చంటి ఎనేర్జిని మ్యాచ్  చేయాలనే ప్రయత్నాలు కూడా చేస్తోంది. శ్రీముఖి ని ఫాలో అవుతూ తనపై తాను ఒత్తిడి పెంచుకుంటుంది వర్షిని. ఈ క్రమంలోనే ఓ ఎపిసోడ్ లో స్టూడెంట్ బుగ్గ కొరికింది వర్షిని. ఏదేమైనా ప్రస్తుతం వర్షిని మాత్రం శ్రీముఖి ల గోల గోల చేయడానికి తెగ ప్రయత్నాలు చేస్తూ ఒత్తిడికి గురవుతున్న ట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: