విక్టరీ వెంకటేష్‌, యంగ్ హీరో నాగ చైతన్యలు హీరోలుగా తెరకెక్కిన మల్టీ స్టారర్‌ మూవీ వెంకీ మామ. కేయస్‌ రవీంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను సురేష్‌ ప్రొడక్షన్స్‌, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ప్రేమమ్’ సినిమాలో కాసేపు వెండితెరపై కనిపించి అభిమానులను కనువిందు చేసిన రియల్ లైఫ్ మామ అల్లుళ్లైన  విక్టరీ వెంకటేష్, నాగ చైతన్య ప్ర‌స్తుతం వెంకీ మామ సినిమాలో పూర్తి స్థాయిలో కలిసి  నటించారు. ఈ చిత్రం రొటీన్ అనీ, ట్రీట్మెంట్ మరీ పాత చింతకాయ పచ్చడి తరహాలో ఉందనేది క్రిటిక్స్ మాట. అయితే క్రిటిక్స్ అందరూ ఆశ్చర్యపోయేలా, ట్రేడ్ పండితులు విస్తుపోయేలా వెంకీ మామ కలెక్షన్స్ వచ్చాయి. 

 

వెంకటేశ్‌ పుట్టిన రోజు సందర్భంగా డిసెంబరు 13న విడుదలైన ఈ సినిమా వసూళ్ల ప‌రంగా మొద‌టి మూడు రోజులు దూసుకుపోయింది. మొద‌టి మూడురోజుల్లోనే 45 కోట్ల రూపాయలు వసూలు చేసి బాక్సాఫీస్‌ వద్ద సత్తా చాటింది. ఈ క్రేజీ మల్లీస్టారర్‌ పాజిటివ్‌ టాక్‌తో దూసుకుపోతూ దగ్గుబాటి, అక్కినేని అభిమానులను ఖుషీ చేసింది. ముఖ్యంగా బీ, సీ సెంటర్స్‌లో  ఈ చిత్రం సంచలన వసూళ్లు సాధించింది. అయితే ఈ సినిమా వీక్ డేస్ లో రోజు రోజుకీ తగ్గుతూ వచ్చింది. కలెక్షన్స్‌ కంప్లీట్ డ్రాప్ కాకపోయినా చాలా వరకూ డ్రాప్ అయ్యాయి. 

 

అలాగే ఈ వీకెండ్ మరో నాలుగు సినిమాలు ఉండడం వల్ల‌ సెకండ్ వీకెండ్ కూడా అంత స్ట్రాంగ్ గా ఉండే అవకాశం క‌నిపించ‌డం లేదు. ఇక వెంకీ మామ 6వ రోజు ఆంధ్ర – తెలంగాణాలో సుమారు కోటి రూపాయల షేర్ తన ఖాతాలో వేసుకుంది. కాగా, ఈ చిత్రంలో వెంకీకి జోడీగా పాయల్ రాజ్‌పుత్‌ నటించగా, నాగచైతన్య సరసన రాశీఖన్నా హీరోయిన్‌గా నటించింది. సురేష్‌ బాబు, టీవీ విశ్వప్రసాద్‌లు సంయుక్తంగా సుమారు రూ. 40 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. 

 

‘వెంకీ మామ’ ఆరు రోజుల ఆంధ్ర – తెలంగాణ కలెక్షన్ వివరాలు:

 

నైజాం- 8.65 కోట్లు

 

సీడెడ్- 3.74 కోట్లు

 

గుంటూరు- 1.81 కోట్లు

 

ఉత్తరాంధ్ర- 3.1 కోట్లు

 

తూర్పు గోదావరి- 1.75 కోట్లు

 

పశ్చిమ గోదావరి- 1.11 కోట్లు

 

కృష్ణా- 1.35 కోట్లు

 

నెల్లూరు- 0.81 కోట్లు
-------------------------------------------------------
ఫస్ట్ 6 డేస్ మొత్తం షేర్- 22.32 కోట్లు
--------------------------------------------------------

 

కర్ణాటక +ఇండియా- 2.25 కోట్లు

 

ఓవర్సీస్-2.75 కోట్లు
----------------------------------------------------------
వరల్డ్ వైడ్ 6 రోజుల షేర్- 27.32 కోట్లు
----------------------------------------------------------

మరింత సమాచారం తెలుసుకోండి: