2019 సంవ‌త్స‌రం ముందు నుంచి ఈసారి అన్నీ హిట్లే సాధించాయి. ఈ సంవ‌త్స‌రంలో పెద్ద‌గా ఫ్లాప్‌లు అయితే రాలేదు. అంతేకాక‌ 'సాహో', 'సైరా' సినిమాలు పాన్ ఇండియా మూవీస్ గా విడుదలై తెలుగు సినిమా సత్తాని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పాయి. 2019లో టాప్ 10 చిత్రాల జాబితాను ఒకసారి పరిశీలిస్తే.. టాప్ ప‌ది చిత్రాల్లో చూసుకుంటే పెద్ద హిట్లంటే రాక్షసుడు, గ్యాంగ్ లీడర్ నిలిచాయి. తమిళ సూపర్ హిట్ చిత్రం 'రక్షసన్' రీమేక్ గా వచ్చిన ఈ సినిమాతో బెల్లంకొండ శ్రీనివాస్ మంచి హిట్ ని సాధించాడు.

 

అలాగే, విక్రమ్ కె కుమార్ డైరెక్షన్ లో రైటర్ పెన్సిల్ పార్ధసారధిగా వచ్చిన నేచరల్ స్టార్ నాని కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి హిట్ ని కొట్టాడు. ఈ రెండు సినిమాలు పెద్దగా అంచనాలు లేకుండా వచ్చి మంచి విజయాన్ని సాధించాయి. ఇక 9వ స్ధానాన్ని చూసినట్లయితే చిన్నబడ్జెట్ సినిమాతో మంచి హిట్ కొట్టింది బ్రోచేవారెవరురా. అలాగే సేమ్ ప్లేస్ లో సాయిధరమ్ తేజ్ నటించిన చిత్రలహరి కూడా క్లాసిక‌ల్ హిట్ అయింది.  సో ఈ రెండు సినిమాలు కూడా మంచి సక్సెస్ ని సాధించాయి.

 

ఇక ఎనిమిద‌వ స్థానంలో చూసినట్లయితే.., నవీన్ పోలిశెట్టి నటించిన ఏజంట్ సాయిశ్రీనివాస్ ఆత్రేయ అలాగే, కళ్యాణ్ రామ్ 118 సినిమాలు ఉన్నాయి. ఈ రెండు సినిమాలు కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఒక్క‌సారిగా క‌ళ్యాణ్‌రామ్  రేంజ్ కాస్త మారింది. 

 

ఇక టాప్ సెవన్ లో రెండు సినిమాలు ఉన్నాయి. ఒకటి అడవి శేషు నటించిన `ఎవరు` సినిమా అలాగే నేచరల్ స్టార్ నటించిన జెర్సీ సినిమా. ఈ రెండు సినిమాలు కూడా కలక్షన్స్ పరంగా మంచి వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమాల్లో నిలిచాయి. అంతేకాదు, సినీ క్రిటిక్స్ నుంచి కూడా మంచి ప్రశంసలు అందుకున్నాయి.

 

టాప్ 6 లో చూసినట్లయితే సమంత నటించిన రెండు సినిమాలు ఉన్నాయి. ఒకటి ఓ బేబీ సినిమా అయితే మరొకటి మజిలీ సినిమా. ఈ రెండు సినిమాల్లో కూడా నాగచైతన్య ఉండటం విశేషం. అంతేకాదు, సమంత సోలోగా ఈ సినిమాలతో 50కోట్ల క్లబ్ ని దాటింది కూడా. టాప్ ఐదో స్ధానంలో ఇస్మార్ట్ శంకర్ సినిమా. పూరీ జగన్నాధ్ కంబ్యాక్ మూవీగా ఈ సినిమా మాస్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది.


అలాగే 100కోట్ల క్లబ్ లో కూడా చేరింది. ఇక కలక్షన్స్ పరంగా చూస్తే టాప్ 4 ప్లేస్ లో ఉంది. ఎఫ్ 2 సినిమా. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో సంక్రాంతికి రిలీజైన  ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొని బాక్సాఫీస్ ని షేక్ చేసింది. విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ లు చేసిన ఫన్ అండ్ ఫ్రస్టేషన్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది.

 

ఇక టాప్ త్రీ లో చూసినట్లయితే మహేష్ బాబు నటించి మహర్షి సినిమా ఉంది. నిలకడైన కలక్షన్స్ ని సాధించి అద్భుతమైన పాజిటివ్ టాక్ ని తెచ్చుకుంది ఈ సినిమా. 2019లో క్లాసికల్ హిట్ గా అందరికీ గుర్తుండి పోయింది. ఇక టాప్ 2 లో మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా సినిమా ఉంది. కలక్షన్స్ పరంగా మెగాస్టార్ స్టామినాని మరోసారి నిరూపించింది.

 

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో సినిమా టాప్ 1గా నిలిచింది. 450కోట్లకి పైగా కలక్ట్ చేసిన ఈ సినిమా ఇండియన్ స్క్రీన్ పై తెలుగు సినిమా సత్తాని మరోసారి చాటి చెప్పింది. ముఖ్యంగా హిందీలో ప్రబాస్ కి  ఈసినిమా సోలో మార్కెట్ ని క్రియేట్ చేసింది. ఈ సంవ‌త్స‌రం బ్లాక్ బ‌స్ట‌ర్ల‌గా నిలిచాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: